తూర్పుగోదావరి(పెద్దాపురం) : పెద్దాపురం ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం నిర్వహించిన దాడుల్లో ఐదుగురు నిందితులతో పాటు, 650 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి. నాగభూషణం తెలిపారు. రంగంపేట మండలం ఈలకొలనుకు చెందిన కురుకూరి దుర్గా ప్రసాద్, కురుకూరి శ్రీను, అనసూరి శ్రీను, సూరిబాబు, కేతా రాంబాబులు సారా అమ్ముతుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. వీరి నుంచి 75 లీటర్ల సారా స్వాదీనం చేసుకున్నామన్నారు.
ఈలకొలను, వడిశలేరు. రంగంపేట, మర్లావ, సూరంపాలెం గ్రామాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి సారా తయారీకి ఉపయోగించే 650 కేజీల నల్లబెల్లం, 10 కేజీల అమ్మోనియాను స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో హజరుపరిచినట్టు తెలిపారు. దాడుల్లో డిప్యూటీ కమిషనర్ హెచ్. సత్యనారాయణ, ఎస్సైలు బీమరాజు, హెచ్.వి.ఎస్.ఎస్. సుబ్రహ్మణ్యం, ఎండీ జైనురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్‌దాడుల్లో ఐదుగురి అరెస్టు
Published Sat, Sep 26 2015 10:50 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement