2019లో మోదీ విజయాన్ని ఎవరూ ఆపలేరు | Forget 2019, no leader can take on Narendra Modi, says Omar Abdullah | Sakshi
Sakshi News home page

2019లో మోదీ విజయాన్ని ఎవరూ ఆపలేరు

Published Sat, Mar 11 2017 2:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

2019లో మోదీ విజయాన్ని ఎవరూ ఆపలేరు - Sakshi

2019లో మోదీ విజయాన్ని ఎవరూ ఆపలేరు

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ విజయాన్ని ఏ నాయకుడు కూడా అడ్డుకోలేడని జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ఉత‍్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఒమర్‌ స్పందిస్తూ.. ఈ లెక్కన చూస్తే 2019 లోక్‌సభ ఎన్నికల గురించి మరచిపోయి, 2024 ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పారు.

ఎన్డీయేలో భాగస్వామ్యం కాని నేషనల్‌ కాన‍్ఫరెన్స్‌ నేత ఒమర్‌ బీజేపీపై ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ మంచి విజయం సాధించిందని, గోవా, మణిపూర్‌లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని ఒమర్‌ పేర్కొన్నారు. తాజా ఫలితాలను బట్టి వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కష‍్టమని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement