ప్రధానికి లీగల్ నోటీసులు ? | Gau Rakshaks Hit Out at PM Modi, Hindu Mahasabha Mulls Legal Action | Sakshi
Sakshi News home page

ప్రధానికి లీగల్ నోటీసులు ?

Published Mon, Aug 8 2016 5:00 PM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM

Gau Rakshaks Hit Out at PM Modi, Hindu Mahasabha Mulls Legal Action

న్యూఢిల్లీ: గో సంరక్షకులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖలను గో సంరక్షణ, హిందూ సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గో సంరక్షకుల్లో 80 శాతానికి పైగా సంఘ విద్రోహశక్తులున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎమ్) యోచిస్తోంది.

ఏబీహెచ్ఎమ్ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాష్ కౌషిక్ మాట్లాడుతూ.. 2004 ఎన్నికల్లో వాజ్ పేయికి పట్టిన గతే ప్రధాని మోదీకి కూడా పడుతుందని అన్నారు. ప్రధానిమంత్రి పీఠానికి మోదీ సరితూగరని విమర్శించారు. ప్రధాని చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు లీగల్ టీంతో సంప్రదింపులు జరపుతున్నట్లు వివరించారు. గోవుల సంరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఏబీహెచ్ఎమ్ చీఫ్ స్వామి చక్రపాణి ఖండించారు.

గోవుల సంరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మైసూరుకు చెందిన గో సంరక్షకులు ప్రధానికి లేఖ రాశారు. కాగా గో సంరక్షకులపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సమర్ధించింది. గో సంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని పేర్కొంది. అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యనించింది. 'మై గవ్' టౌన్ హాల్ , మెదక్ జిల్లా గజ్వేల్ మీటింగ్ లలో ప్రధానమంత్రి గో సంరక్షకులపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement