దైవ స్వరం | God's voice | Sakshi
Sakshi News home page

దైవ స్వరం

Published Wed, Nov 23 2016 2:42 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

దైవ స్వరం

దైవ స్వరం

చిన్నతనంలోనే సంగీతాన్ని ఔపోసన పట్టిన బాలమురళీకృష్ణ
- తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జననం  పారుపల్లి రామకృష్ణయ్య వద్ద సంగీత శిక్షణ
- ఎనిమిదేళ్లకే విజయవాడలో సంగీత కచేరీ  పదిహేనేళ్లకే 72 మేళకర్త రాగాల్లో ప్రావీణ్యం
- తెలుగు సహా ఎన్నో భాషల్లో సంగీత గానం  ప్రపంచ దేశాల్లో సుమారు 25 వేల కచేరీలు
- హేమాహేమీలతో కలసి జుగల్‌బందీలు  వరించిన పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు  
 
 బాలమురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో 1930 జూలై 6న జన్మించారు. ఆయన తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. ఆయన ప్రముఖ సంగీతకారుడు. వేణువు, వయోలిన్  వీణ విద్వాంసుడు కూడా. వయోలిన్ టీచర్‌గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవారు. బాలమురళి తల్లి సూర్యకాంతం కూడా గొప్ప వీణా విద్వాంసురాలు. బాలమురళి జన్మించిన 13వ రోజునే తల్లి మరణించడంతో అమ్మమ్మ ఊరు గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగారు. చిన్నతనంలోనే బాలమురళీకృష్ణకు సంగీతంపై ఎంతో ఆసక్తి ఉన్నట్లు గ్రహించిన తండ్రి.. ఆయనను త్యాగరాజ శిష్య వారసుల్లో ఒకరైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద సంగీత శిక్షణ కోసం చేర్పించారు. పారుపల్లి మార్గదర్శకత్వంలో బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే విజయవాడలో త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో పూర్తిస్థారుు కచేరీ నిర్వహించారు. చాలా చిన్న వయసులోనే సంగీత కళాకారుడిగా జీవితం ప్రారంభించారు. పదిహేనేళ్ల వయసుకే మొత్తం 72 మేళకార్త రాగాల్లో ప్రావీణ్యం సంపాదించటమే కాదు.. వాటిలో కృతులను కూడా కూర్చారు బాలమురళీకృష్ణ. సంగీతంలోని అన్ని విభాగాల్లో విసృ్తత పాండిత్యం, శ్రోతలను మంత్రముగ్ధులను చేసే గాత్రం, సంగీత కూర్పులో తనదైన ప్రత్యేక శైలి.. ఆయనను సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్తానీ సంగీతంలోని ప్రముఖ సంగీతకారులతో కలసి పనిచేశారు. బాలమురళి గాత్రంలో అన్నమాచార్య కీర్తనలు, భద్రాచల రామదాసు కీర్తనలకు విశేష ప్రాచుర్యం లభించింది. సుసంపన్నమైన గాత్ర నైపుణ్యాలు, సంప్రదాయ సంగీతంలోని లయ విన్యాసాలతో కూడి బాలమురళి గాత్ర, సంగీత కచేరీలు ప్రజలను అలరించేవి.    - సాక్షి నాలెడ్జి సెంటర్
 
► మాతృభాష తెలుగులోనే కాకుండా.. కన్నడం, సంస్కృతం, తమిళం, మళయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీల్లోనూ మంగళంపల్లి సంగీత ప్రస్థానం సాగింది. ఫ్రెంచ్ భాషలో సైతం ఆయన గానం చేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్‌‌స, రష్యా, సింగపూర్ సహా ఎన్నో దేశాల్లో కచేరీలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 25,000 కచేరీలు చేశారు. 2010 ఫిబ్రవరిలో విశాఖలో తొలిసారిగా 3 రోజుల కచేరీ చేశారు.
► జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకు బాలమురళీకృష్ణ ఆద్యుడు. ఈ తరహా కచేరీని మొట్టమొదట పండిట్ భీమ్‌సేన్ జోషితో కలసి ముంబై లో నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్ తదితరు లతోనూ జుగల్ బందీ కచేరీలు చేశారు. ఈ కచేరీలతో విశేష ప్రజా దరణ రావడమే కాక ..సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డారుు.
► మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొత్త రాగాలను కూడా ఆవిష్కరించారు. కంజీర, వయోలిన్, వయోలా, వీణ, మృదంగం తదితర సంగీత వారుుద్యాల్లోనూ ఎంతో ప్రావీణ్యం ఉంది. టీటీడీ, శృంగేరీ పీఠాలకు బాలమురళి ఆస్థాన విద్వాంసుడుగా ఉన్నారు.
► తొలిసారిగా భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా నటించారు. తెలుగు, కన్నడ, తమిళం తదితర భాషల్లో పలు చిత్రాలకు, 400కు పైగా సినీ గీతాలకు సంగీతం అందించారు.
► బాలమురళికి ఇటీవలి కాలంలో ‘సంగీత చికిత్స’పై ఆసక్తి పెరిగింది. కళా సంస్కృతుల అభివృద్ధి, సంగీత చికిత్సలో విసృ్తత పరిశోధన లక్ష్యంగా ‘ఎంబీకే ట్రస్టు’ను ఆయన స్థాపించారు. ‘విపంచి’ అనే నృత్య, సంగీత పాఠశాల ఈ ట్రస్టులో భాగం. ఈ అంశంలో కృషి చేయడానికి స్విట్జర్లాండ్‌లో ‘అకాడెమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్‌‌ట్స అండ్ రీసెర్చ్’ స్థాపనకు కృషి చేశారు.
 
 నేర్చుకోవడం ఆపకూడదని గుర్తుచేస్తుంది...
 మంగళంపల్లికి తల్లిదం డ్రులు పెట్టిన పేరు మురళీకృష్ణ. ప్రముఖ హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ.. ఆయన పేరుకు ముందు ‘బాల‘ అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచారు. ‘బాల’ అనేది నా పేరుకు ముందు వచ్చి చేరడం మంచిదైంది. నేర్చుకోవడాన్ని ఆపకూడదని ఈ పదం ఎప్పటికప్పుడు నాకు గుర్తుచేస్తూ ఉండేది. తొలిసారి పూర్తిస్థారుు కచేరీ చేసే అవకాశం వచ్చినపుడు నాకు ఎనిమిదేళ్లు. అప్పటినుంచి శ్రోతలకు నేను బాలమురళీకృష్ణగానే ఎరుక’’ అని ఓ సందర్భంలో బాలమురళీకృష్ణ పేర్కొన్నారు.
 
నేను ఇంగ్లిష్‌లో.. ఆమె హిందీలో
 మంగళంపల్లి 30 ఏళ్ల వయసులో స్టేజీపై ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. నడుము పై భాగాన్ని కదిలిస్తూ, పక్క వారుుద్యకారుల వైపు పలకరించినట్టుగా వంగుతూ, కూర్చున్నచోటే తిరుగాడినంత పనిచేసేవారు. రాగం, స్వరం, తాళం, లయ అన్నిటిపైనా బాలమురళికి ఎంతో అధికారమూ, నియంత్రణ ఉండేవని సంగీతజ్ఞులు చెబుతారు. అంతెందుకు, సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ ఆయన్ని ఎంతో అభిమానించేవారు. అరుుతే, ‘ఆవిడతో మీరెలా మాట్లాడారు?’ అని బాలమురళిని అడిగితే, ‘నేనేమో ఇంగ్లీషులో మాట్లాడతాను, అది ఆవిడకర్థం అవుతుంది. ఆవిడ హిందీలో జవాబు చెపుతుంది, అది నా కర్థం అవుతుంది’ అన్నారు. ‘ఆవిడ తన మనసులోని భావాన్ని చెప్పదు; మన భావాల్ని మాత్రం ఇట్టే తెలుసుకుంటుంది’ అని కూడా అన్నారు కొసమెరుపుగా.
 
‘శంకరాభరణం’ ఏదీ?

 అడపాదడపా బాల మురళి ఎన్నో ఛలోక్తులు విసిరేవారు. ఆయన మృ దంగ విద్వాంసుడు టి.వి. గోపా లకృష్ణన్‌తో కలిసి కొన్నాళ్లు గాత్రకచేరీలు చేశా రు. గోపాలకృష్ణన్ మృదంగం వారుుస్తున్నప్పుడు ప్రధాన గాయకుడిలాగానూ, గాత్రం పాడుతున్నప్పుడు పక్కవారుుద్యగాడిలాగానూ ప్రవర్తిస్తాడు అన్నారు బాలమురళి. మరో సందర్భంలో.. ‘శంకరాభరణం సినిమా చూశారా?’ అని అడిగితే ‘చూశాను. అరుుతే అందులో శంకరాభరణం ఏదీ?’ అని ఎదురు ప్రశ్నించారాయన.
 
నాకు తోచినది నేను పాడతాను
 తాను పాడిన సినిమా పాటలను గురించి ప్రస్తావిస్తూ, ‘మ్యూజిక్ డెరైక్టర్లు ఏదో చెపుతారు. నాకు తోచినది నేను పాడతాను. అది వాళ్లకు నచ్చుతుంది’ అన్నారు బాలమురళి. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలోని ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు’, ‘నర్తనశాల’లో ‘సలలిత రాగ సుధారస సారం’, ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు’లో ‘వసంత గాలికి వలపులు రేగ’ వంటి పాటలు పాడారు. ‘కర్ణ’ లో ‘నీవూ నేనూ వలచితిమి’, ‘గుప్పెడు మనసు’లో ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా!’ వంటి పాటలు కూడా గుర్తుండిపోయేవే.
 
 కథానాయకుడిగానూ నటించారు...
 పాడటమే కాదు, నటనలోనూ బాలమురళి మెప్పించారు. ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో పాడమని మెయ్యప్పన్ చెట్టియార్ కోరగా, అందులోని పాటలు పాడటమే కాదు, నారద పాత్ర కూడా తానే వేస్తానని బాలమురళి అడిగారటారు. అలాగే ఆ పాత్ర ధరించారు కూడా! అంతేకాదు ఎస్.వి.రంగారావుతో కలసి ఆత్మవిశ్వాసంతో నటించగలగడం చెప్పుకోదగిన అంశం. ఎందుకంటే, ఆ రోజుల్లో పెద్ద నటులు కూడా ఎస్వీఆర్ తమను మింగేస్తాడని ఆయనతో నటించేందుకు జంకేవారు. బాపు తీసిన ‘త్యాగయ్య’ చిత్రానికి తాను పాడి, నటిస్తానని బాలమురళి కోరారని, అరుుతే దానికి బాపు ఒప్పుకోలేదని చెబుతారు. చివరకు త్యాగయ్యగా జె.వి.సోమయాజులు నటించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. అరుుతే ఆ సినిమా ఫెరుులైంది. బాలమురళి నటించి ఉన్నా, కనీసం పాడి ఉన్నా ఆ సినిమా ఎలావుండేదోనన్న ప్రశ్న ఆయన అభిమానుల్లో ఉంది. ‘సంధ్య గిదేన సింధూరం’ అనే మలయాళ చిత్రంలో కథానాయకుడిగా కూడా చేశారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement