ముంబై: ముంబైలో శనివారం పసిడి, వెండి ధరలు భారీగా పెరి గాయి. పసిడి తిరిగి రూ.30,000 దాటింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.460 ఎగసి రూ.30,300కు చేరింది. ఆభరణాల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ. 30,150గా ఉంది. వెండి కేజీ ధర రూ.975 ఎగసి రూ.51,200కు చేరింది.
శుక్రవారం ఫ్యూచర్స్ మార్కెట్లలో తొలుత నష్టాల్లో పయనించిన విలువైన మెటల్స్ ట్రేడింగ్ చివర్లో రికవరీ సాధించడం అలాగే కొనుగోలుదారులు, స్టాకిస్టులు, ఆభరణాల వర్తకుల నుంచి తాజా డిమాండ్ పసిడి, వెండి లాభాలకు ప్రధాన కారణాలు.
పసిడి, వెండి ధరల పరుగు
Published Sun, Sep 15 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement