బంగారం ధరలు పైపైకి..ఎందుకు?
ఒక పక్క ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు యూకే ప్రధాని థెరెసా మే నేడు బ్రెగ్జిట్ ప్రణాళికలను ప్రకటించనున్న నేపథ్యంలో బంగారం ధరలు పైపైకి పయనిస్తున్నాయి. అమెరికా 45వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లలో ఆందోళనలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా నాటో, చైనాలపై చేస్తున్న వ్యాఖ్యలు ఇన్వెస్లర్లను ప్రభావితం చేస్తున్నాయి. మదుపర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వరుసగా ఏడో రోజు కూడా బంగారం ధరలు బలపడి ఏడు వారాల గరిష్టానికి చేరాయి. మరోపక్క డాలరుతో మారకంలో యూకే పౌండ్ 3 నెలల కనిష్టాన్ని తాకగా, జపనీస్ యెన్ స్వల్పంగా బలపడింది. ఈ ఏడాది 5 శాతం ర్యాలీ అయ్యాయి. అయితే మార్కెట్ లోతీవ్ర అనిశ్చితి నెలకొందని సింగపూర్ కు చెందిన ట్రేడ్ ఎనలిస్ట్ , గోల్డ్ అండ్ సిల్వర్ కంపెనీ ఎండీ బ్రియాన్ ల్యాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా సంక్షోభం నెలకొన్న సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితమని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 9 డాలర్లకుపైగా(0.8 శాతం) ఎగసి 1206 డాలర్లుగా నమోదైంది. సోమవారం ట్రేడింగ్‌లో తొలుత 1,208 డాలర్ల వరకూ జంప్‌చేసింది. ఇక వెండి కూడా ఔన్స్ 0.5 శాతం పుంజుకుని 16.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 149 పెరిగి రూ. 28,529కు చేరింది. ఇదే బాటలో పయనిస్తున్న వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 73 బలపడి రూ. 40,960ను తాకింది. ఈ ఏడాది 5 శాతం ర్యాలీ అయ్యాయి.
డాలర్ ర్యాలీలో విరామం, పసిడికి పెరిగిన డిమాండ్ సంకేతాలతో బులియన్ మార్కెట్ పాజిటివ్ గా ఉంది. బ్లూమ్బెర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్, మంగళవారం 0.2 శాతం పడిపోయింది, అయితే మార్కెట్ లోతీవ్ర అనిశ్చితి నెలకొందని సింగపూర్ కు చెందిన ట్రేడ్ ఎనలిస్ట్ , గోల్డ్ అండ్ సిల్వర్ కంపెనీ ఎండీ బ్రియాన్ ల్యాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా సంక్షోభం నెలకొన్న సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితమని వ్యాఖ్యానించారు.
ఈఏడాది 5 శాతం ర్యాలీ అయ్యాయి. అయితే ఈక్విటీ మార్కెట్ లో తీవ్ర అనిశ్చితి నెలకొందని సింగపూర్ కు చెందిన గోల్డ్ అండ్ సిల్వర్ కంపెనీ ఎండీ బ్రియాన్ ల్యాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా సంక్షోభం నెలకొన్న ఇలాంటి సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితమని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.