haven
-
సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!
అది సెలబ్రిటీలకు, యువ రాజులకు స్వర్గధామం. ప్రైవేటు బీచుల మీదుగా వీచే చల్లటిగాలులు, అహ్లాదకరమైన వాతావరణంతో అలరారే పరిసరాల మధ్య అనంద డోలికల్లో తేలిపోతూ కమ్మని సువాసనల మధ్య కమనీయ ముచ్చట్లతో మురిసిపోతూ పసందైన వంటకాల రుచులను ఆస్వాదిస్తూ ‘స్వర్గమే కదా ఇదీ!’ అంటూ తూగే ప్రాంతమది. నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీలకు అది ఓ రహస్య స్వర్గం. రసమయ లోకం. అన్యులకు అందని ఆనందాల తీరం. అక్కడి రాయల్ విల్లా నిజంగా రారాజుల విల్లానే. అందుకే ప్రముఖ హాలీవుడ్ సెలిబ్రిటీలు లియోనార్దో డికాప్రియా, మెరిల్ స్ట్రీప్, క్రిస్టినో రొనాల్డో, కైలి మినోగ్, మెల్గిబ్సన్లు తరచు వచ్చి పోతుంటారు. గ్రీస్‌లోని అథేనియా రివీరాలో ఓ ప్రైవేటు ద్వీపకల్పమే ఈ స్వర్గధామం. 72 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమై 16 హోటల్ బీచెస్, 8 ప్రైవేటు బీచెస్, రాయల్ విల్లాలు ఉన్నాయి. బంధు, మిత్రులతో కాకుండా సకల పని వారలతో కలసి వచ్చినా వారందరికి తగిన వసతులు అందుబాటులో ఉన్నాయి. విల్లాలలోనే కాకుండా హోటళ్లలో కూడా విశాలమైన పడక గదులు, విశ్రాంతి గదులతో పాటు, స్వీయ పాకానికి వంట శాలలు, అధునిక మధు శాలలు, వ్యాయామానికి ప్రైవేటు జిమ్ములు ఉన్నాయి. సూర్య చంద్రుల ఆగమ, నిష్క్రమణ సంధ్యా కాంతులకు అనుగుణంగా, అల్పాహార, మధ్యాహ్న, విందు భోజనాలను ఆస్వాదించేందుకు అన్ని దిక్కుల అహ్లాద ఏర్పాట్లు ఉన్నాయి. ఒకటేమిటీ మార్బుల్ బాత్రూమ్లతోపాటు ఇండోర్, అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అవసరాన్నిబట్టి వాటిలోని నీరును వేడినీరుగా కూడా మార్చుకునే వెసలుబాటూ ఉంది. 24 గంటలపాటు వంటవాడు అందుబాటులో ఉండడమే కాకుండా 24 గంటలపాటు సర్వీసు ఉంటుంది. సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా ఈ స్వర్గధామంలో అడుగుపెట్టేందుకు ఓ హెలిపాడ్‌తో పాటు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా చెప్పుకుంటే అమ్మాయికి అబ్బాయి పెళ్లి ఆఫర్ చేసినప్పుడు హెలికాప్టర్ గుండా పుష్పాభిషేకం కూడా చేస్తారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా! అత్యంత ఖరీదు కాబోలు అనుకుంటే పొరపాటే! ఇక్కడి అన్నింటి కన్నా విలాసవంతమైన 400 చదరపు అడుగుల రాయల్ విల్లాలో ఒక రోజు ఉండేందుకు కేవలం లక్ష రూపాయలే. అతిథుల కోసం సూట్లతోపాటు హోటళ్లలో ఒకటేసి గదులు కూడా ఉన్నాయి. పనివారలు, వ్యక్తిగత సిబ్బంది కోసం ఇతర గదులు ఉన్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఇక్కడి సొంత వంటవాళ్లను వెంట తెచ్చుకుంటారు.‘మామ మియా’ సినిమాను 2008లో ఇక్కడే తీశారు. అప్పుడు ఆ సినీ తారలలోపాటు యావత్ నిర్మాణ సిబ్బంధి ఇక్కడే ఉన్నారు. అందుకనే వివిధ స్థాయిల వ్యక్తులను, వారి అవసరాలను, అభిరుచులను దష్టిలో పెట్టుకొని ఇక్కడ తగిన ఏర్పాటు చేశారు. ప్రముఖ గ్రీక్ ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్స్ ఇక్కడి వసతులను ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. రాల్ఫ్ లారెన్, కామెరిచ్, విల్లా లూమి, మురానో లాంటి ప్రముఖ నిపుణులు ఇక్కడి ఫర్నీచర్‌కు రూపకల్పణ చేశారు. అతిథుల అభిరుచులకు అనుగుణంగా పెద్ద పెద్ద చెట్లను తొలగించి కూడా వాటి స్థానంలో ఎప్పటికప్పుడు ఇతర చెట్లను రీప్లాంట్ చేయడం ఇక్కడ మరో విచిత్రం, విశేషం అని కూడా చెప్పవచ్చు. అందమైన అమ్మాయిలు మరింత అందంగా మెరిసి పోవాలనే ఉద్దేశంతోనేమోగానీ రాయల్ విల్లా నిర్వాహకులు ఇటీవల అమ్మాయిల కోసం 24 క్యారెట్ల బంగారు స్విమ్మింగ్ సూట్లుకు తెప్పించారట! -
తాలిబన్ల స్వర్గం.. పాకిస్తాన్
వాషింగ్టన్ : పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గమని మరోసారి అమెరికా పేర్కొంది. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోయిన తాలిబన్లు.. పాకిస్తాన్లో క్షేమంగా ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్లోని సంకీర్ణ బలగాల సైన్యాధికారి జనరల్ జాన్ నికోల్సన్ స్పష్టం చేశారు. తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్లో కావలసినంత డ్రగ్స్, డబ్బూ లభిస్తోందని ఆయన చెప్పారు. తాలిబన్ ఉగ్రవాదులు పాకిస్తాన్లో క్షేమంగా తలదాచుకున్నారని ఆయన తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్నుంచి తాలిబన్లను ఏరేయడానికి అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం సరైందేనని చెప్పారు. అయితే తాలిబన్లకు పాకిస్తానే ఆశ్రయం కల్పించడంతో.. పోరాటం కొనసాగించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ట్రంప్ న్యూ ఆఫ్ఘన్ పాలసీకి పాకిస్తాన్ అనుకూలమని ప్రకటించినా.. ఇప్పటివరకూ అమలు చేయలేదని ఆయన ప్రకటించారు. -
జైలంటే జైలూ కాదు స్వర్గంగా ఉందీ చూడు..
ఓస్లో: ప్రపంచంలో జైలు అనగానే ఊచలున్న, గాలి వెలుతరురాని నాలుగు గదుల గోడ, రుచీ పచిలేని తిండి, చుట్టూ తుపాకులతో కాపలాకాచే పోలీసులు, నిద్ర పట్టకుండా దోమలు, దుర్గంధం, పోలీసు పద ఘట్టనలు, కాపలా కుక్కల అరుపులు గుర్తొస్తాయి. జైలంటే ఏ మాత్రం స్వేచ్ఛలేని దుర్భర జీవితం. నార్వేలోని బాస్టాయ్ జైలు ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆ జైలుపక్షుల దైనందిన జీవితం గురించి వింటే మనమే నేరం చేసి జైలుకు వెళితే బాగుండునేమో అనిపిస్తుంది. అక్కడి ఖైదీలు పోలీసులెవరూ లేపకుండానే క్రమశిక్షణతో పొద్దునే లేస్తారు. అందరూ వ్యాయామం చేస్తారు. కొందరు జైల్లోనే ఉన్న జిమ్‌కు వెళతారు. కసరత్తు చేస్తారు. కండలు పెంచుతారు. టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత ఆపక్కనే ఉన్న బీచ్‌కు వెళతారు. సన్‌బాత్ చేస్తారు. కొందరు సముద్రంలో జలకాలాడుతారు. పైన్ చెట్లను నీడన సేదతీరుతారు. ఆ తర్వాత జైలు నిబంధనల మేరకు గుర్రాలు, గొర్రెలు గాస్తారు. వ్యవసాయ పనులు చేస్తారు. జైల్లోపలికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఎక్కువ వరకు ఖైదీలే తమకిష్టమైన ఆహారం వండుకొని తింటారు. ఈ బాస్టాయ్ జైల్లో కటకటాల గదులు ఉండవు. చిన్న డబుల్ బెడ్ రూమ్ గదులు ఉంటాయి. ఖైదీలు తమకిష్టమైన గదుల్లో ఉండవచ్చు. మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ఎవరి పనులకు వారు వెళతారు. సాయంత్రం బీచ్ ఒడ్డున బిచానా వేస్తారు. ఆనందంగా గడుపుతారు. మళ్లీ చీకటిపడేలోగా జైలుకు వస్తారు. రాత్రి భోజనం చేసి పడుకుంటరు. ఖైదీలు సముద్రంలో చేపలు పట్టుకోవచ్చు. సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లి ఫుట్‌బాల్ ఆడొచ్చు. జైలు సిబ్బంది, కాపలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఖైదీలే ఓ కమ్యూనిటీగా జైల్లో కూడా అన్ని పనులు వంతులవారిగా చేసుకుంటారు. ఖైదీలకంటూ ప్రత్యేక బట్టలు ఉండవు. సొంతంగా ఎవరికిష్టమైన బట్టలు వారు కొనుక్కోవచ్చు, వాటిని వేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతి మంచి జైలుగా ప్రసిద్ధి చెందిన బాస్టాయ్ జైలులో భద్రతా సిబ్బంది అతి తక్కువగా ఉన్నప్పటికీ ఖైదీలెవరూ పారిపోవడానికి ప్రయత్నించరు. అన్ని సౌకర్యాలు ఉండడం ఒక్కటే ఇందుకు కారణం కాదు. జైలు నుంచి విడుదలవడానికి 18 నెలల ముందు నుంచే బయట ఉద్యోగం చేసుకునే అవకాశం ఖైదీలకు ఉంటుంది. విడుదలయ్యాక వారు అదే ఉద్యోగంలో స్థిరపడి పోతారు. వివిధ ఉద్యోగాలను కల్పించేందుకు కూడా నార్వే ప్రభుత్వం సహకరిస్తుంది. ఓ చిన్న దీవిలో ఉన్న ఈ జైలులో ప్రస్తుతం 115 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో తీవ్ర హింసాత్మక నేరాలు చేసిన వారు కూడా ఉన్నారు. ఘోర నేరాలు చేసిన వారిని నేరుగా ఈ జైలుకు తీసుకోరు. దేశంలోని వేరే జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించి క్రమశిక్షణతో మెలిగినట్లు ధ్రువీకరణ పత్రం పొందటంతో పాటు ఈ జైలుకు రావాలని కోరుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకుంటేనే అలాంటి నేరస్థులను ఇక్కడ అనుమతిస్తారు. ఒక్కసారి నేరం చేసినవారు, మరోసారి నేరం చేయకుండా వాళ్లలో పరివర్తన తీసుకరావడమే ప్రధానంగా ఈ జైలు లక్ష్యం. వారికి జీవితం పట్ల అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు వస్తారు. సెమినార్లు నిర్వహిస్తారు. మంచి గ్రంధాలయం కూడా వారికి అందుబాటులో ఉంది. ఒకసారి జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాక మరో రెండేళ్లలోనే అలాంటి నేరం చేసి జైలుకు వచ్చే వారి సంఖ్య నార్వేలో 20 శాతం మాత్రం. అదే అమెరికాలో మళ్లీ జైలుకు వచ్చే వారి సంఖ్య 50 శాతానికిపైగా ఉంది. నార్వేలో యావజ్జీవ శిక్ష ఉండదు. తీవ్ర నేరాలకు గరిష్ట శిక్ష 21 ఏళ్లు. మరీ తీవ్రమైన మానవ హననానికి పాల్పడితే 30 ఏళ్ల జైలు శిక్ష. 60 శాతం ఖైదీలకు మూడు నెలలలోపే శిక్షలు పడతాయి. 90 శాతం ఖైదీలకు ఏడాది లోపే శిక్ష అనుభవిస్తారు. బాస్టాయ్ జైలు నుంచి సాధారణంగా ఎవరూ పారిపోరు. 2015లో ఓ ఖైదీ సర్వ్బోర్డు ద్వారా పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. అలా పట్టుబడిన వ్యక్తిని కొంత కఠినమైన మరో జైలుకు తరలిస్తారు. -
బంగారం ధరలు పైపైకి..ఎందుకు?
-
బంగారం ధరలు పైపైకి..ఎందుకు?
ఒక పక్క ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు యూకే ప్రధాని థెరెసా మే నేడు బ్రెగ్జిట్ ప్రణాళికలను ప్రకటించనున్న నేపథ్యంలో బంగారం ధరలు పైపైకి పయనిస్తున్నాయి. అమెరికా 45వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లలో ఆందోళనలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా నాటో, చైనాలపై చేస్తున్న వ్యాఖ్యలు ఇన్వెస్లర్లను ప్రభావితం చేస్తున్నాయి. మదుపర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వరుసగా ఏడో రోజు కూడా బంగారం ధరలు బలపడి ఏడు వారాల గరిష్టానికి చేరాయి. మరోపక్క డాలరుతో మారకంలో యూకే పౌండ్ 3 నెలల కనిష్టాన్ని తాకగా, జపనీస్ యెన్ స్వల్పంగా బలపడింది. ఈ ఏడాది 5 శాతం ర్యాలీ అయ్యాయి. అయితే మార్కెట్ లోతీవ్ర అనిశ్చితి నెలకొందని సింగపూర్ కు చెందిన ట్రేడ్ ఎనలిస్ట్ , గోల్డ్ అండ్ సిల్వర్ కంపెనీ ఎండీ బ్రియాన్ ల్యాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా సంక్షోభం నెలకొన్న సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 9 డాలర్లకుపైగా(0.8 శాతం) ఎగసి 1206 డాలర్లుగా నమోదైంది. సోమవారం ట్రేడింగ్‌లో తొలుత 1,208 డాలర్ల వరకూ జంప్‌చేసింది. ఇక వెండి కూడా ఔన్స్ 0.5 శాతం పుంజుకుని 16.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అటు దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 149 పెరిగి రూ. 28,529కు చేరింది. ఇదే బాటలో పయనిస్తున్న వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 73 బలపడి రూ. 40,960ను తాకింది. ఈ ఏడాది 5 శాతం ర్యాలీ అయ్యాయి. డాలర్ ర్యాలీలో విరామం, పసిడికి పెరిగిన డిమాండ్ సంకేతాలతో బులియన్ మార్కెట్ పాజిటివ్ గా ఉంది. బ్లూమ్‌బెర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్, మంగళవారం 0.2 శాతం పడిపోయింది, అయితే మార్కెట్ లోతీవ్ర అనిశ్చితి నెలకొందని సింగపూర్ కు చెందిన ట్రేడ్ ఎనలిస్ట్ , గోల్డ్ అండ్ సిల్వర్ కంపెనీ ఎండీ బ్రియాన్ ల్యాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా సంక్షోభం నెలకొన్న సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితమని వ్యాఖ్యానించారు. ఈఏడాది 5 శాతం ర్యాలీ అయ్యాయి. అయితే ఈక్విటీ మార్కెట్ లో తీవ్ర అనిశ్చితి నెలకొందని సింగపూర్ కు చెందిన గోల్డ్ అండ్ సిల్వర్ కంపెనీ ఎండీ బ్రియాన్ ల్యాన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాజకీయంగా సంక్షోభం నెలకొన్న ఇలాంటి సందర్భాల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితమని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.