
ఆ మిస్టరీ గెస్ట్ ఎవరో తెలుసా?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వినాయక చవితి సందర్భంగా సోమవారం తన అభిమానులకు చిన్న టెస్ట్ పెట్టాడు. గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా సచిన్ తన నివాసంలో బొజ్జ గణపతికి ప్రత్యేక పూజలు చేశాడు. ఈ పూజా కార్యక్రమానికి కొందరు ప్రత్యేక అతిథులు కూడా హాజరయ్యారు.
Guess who dropped by to seek Bappa's blessings today!!?? #GaneshChaturthi pic.twitter.com/h1OSIGKhIe
— sachin tendulkar (@sachin_rt) September 5, 2016
ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ ఫొటోను పెట్టి.. ఈ 'మిస్టరీ అతిథి' ఎవరో గుర్తుపట్టండి అంటూ ఓ కొంటె ప్రశ్నను తన అభిమానులకు సచిన్ సంధించాడు. సహజంగానే ఈ ప్రశ్న అభిమానుల్ని ఉత్సాహ పరిచింది. దీంతో చాలామంది తమ బుర్రకు పదునుపెట్టి బదులు ఇచ్చారు. రోజర్ ఫెదరర్ అని ఒకరు, రికీ పాంటింగ్ అని మరొకరు, బ్రెట్ లీ అని ఇంకొకరు ఇలా ఎవరికి తోచిన సమాధానాలు వారు చెప్పారు. ఇంకా నెటిజన్లను విసిగించడం బాగోదని సచిన్ స్వయంగా ఆ గెస్ట్‌ను వెల్లడించాడు. అతను ఎవరో కాదు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే ఎనలేని గౌరవం. అందుకే తన కూతురికి 'ఇండియా' అని పేరు పెట్టాడు. అతనే గణపతి ఆశీస్సులు పొందేందుకు తన ఇంటికి వచ్చాడని సచిన్ తెలిపాడు. జాంటీరోడ్స్తోపాటు స్టైలిష్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా లిటిల్ మాస్టర్ ఇంట్లో పూజలకు హాజరై.. గణపతిని ప్రార్థించాడు.
Lovely to have the father of baby girl 'India' seeking blessings of the Lord! Always fun meeting @JontyRhodes8 pic.twitter.com/xAJyf5mX8t
— sachin tendulkar (@sachin_rt) September 5, 2016