మెడి క్షనరీ
జంధ్యాల చెప్పినట్లు నవ్వలేకపోవడం తప్పనిసరిగా ఒక రోగం. కానీ అప్రయత్నంగా వికటాట్టహాసం చేయడం లేదా అనియంత్రితంగా ఏడ్వటం కూడా ఒక జబ్బేనట. అయితే, ఇది ఒక ఆదిమ తెగకు మాత్రమే పరిమితం. ‘లాఫింగ్ సిక్‌నెస్’ అని పిలిచే ఈ జబ్బు నరాలపై నియంత్రణ కోల్పోవడం వల్ల వచ్చేది. పపువా న్యూ గినియాలోని ‘ మానవభక్షణ’ చేసే ఆదిమ తెగల్లో పంధొమ్మిది వందల యాభై అరవైలలో ఈ జబ్బు కనిపించేది.
ట్రాన్స్‌మిసిబుల్ స్పంజిఫామ్ ఎన్‌కెఫలోపతి అనే నరాల జబ్బుల వర్గానికి లాఫింగ్ సిక్‌నెస్ చెందుతుందట. ఈ జబ్బును ‘కురు’ అని కూడా పిలిచేవారు. స్వజాతీయుల మెదడును తినే సమయంలో ఆ మెదడుకు ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఇది వస్తుందని డాక్టర్లు కనుగొన్నారు. సరిగ్గా నడవలేకపోవడం, మాట ముద్దగా రావడం, మింగడం కష్టం కావడం... ఇవన్నీ లాఫింగ్ సిక్‌నెస్ లక్షణాలు. కురు అంటే వణుకుతుండటం అని స్థానిక భాషలో ఆ పదానికి అర్థం.
హహ్హహ్హా ...లాఫింగ్ సిక్‌నెస్...!
Published Mon, Oct 19 2015 12:00 PM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement
Advertisement