మేడ్చెల్ (రంగారెడ్డి జిల్లా) : కరువు సమస్యతో తల్లడిల్లుతున్న మేడ్చల్ ప్రజలకు సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించింది. ఉదయం నుంచి ఆకాశం మెఘావృతమై మధ్యాహ్నం గంట పాటు భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత సాయంత్రం వరకు ముసురు పెట్టింది.
భారీ వర్షం కురియడంతో పట్టణంలో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. కరువుతో ఎండిపోతున్న మొక్కజొన్నకు వర్షం ఎంతో దోహదం చేసింది.
మేడ్చల్‌లో భారీ వర్షం
Published Mon, Aug 10 2015 4:17 PM | Last Updated on Fri, May 25 2018 1:22 PM
Advertisement
Advertisement