తిరుమలలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
తిరుమల: తిరుమలలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని 10 కిలోమీటర్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
విషయం తెలిసిన ఆలయ ఇంజనీరింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.