వరద ఉధృతిలో బిక్కుబిక్కుమంటూ! | heavy rains in medak, villagers save a man life | Sakshi
Sakshi News home page

వరద ఉధృతిలో బిక్కుబిక్కుమంటూ!

Published Sun, Sep 25 2016 4:32 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

వరద ఉధృతిలో బిక్కుబిక్కుమంటూ! - Sakshi

వరద ఉధృతిలో బిక్కుబిక్కుమంటూ!

పొలానికి వెళ్లి తిరిగొస్తుండగా ఓ వ్యక్తి వరద ఉధృతిలో చిక్కుకున్నాడు. ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఓ చెట్టు కొమ్మలను గట్టిగా బిగపట్టుకొని సాయం కోసం ఎదురుచూశాడు. ఒకవైపు జోరుగా వరద.. ఏమాత్రం పట్టు సడలినా ప్రాణాలు పోవడం ఖాయం. ఈ నేపథ్యంలో నడి ప్రవాహంలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఇంతలో అతని దుస్థితి గ్రామస్తులకు తెలిసింది.

వారు చూస్తూ ఊరుకోలేదు. అధికారులూ, పోలీసులు వచ్చే వరకు వేచిచూడలేదు. ఆపదలో ఉన్న గ్రామస్తున్ని కాపాడుకునేందుకు తామే స్వయంగా కదిలారు.  సాహసోపేతంగా ఓ తాడు సాయంతో నలుగురైదుగురు వ్యక్తులు వరద ప్రవాహాన్ని దాటుకొని.. ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్తునికి చేయి అందించి చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం చెల్మెడ గ్రామంలో జరిగింది. సాటి గ్రామస్తుడిని సాహసోపేతంగా రక్షించిన చెల్మెడ గ్రామస్తుల తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement