చినుకు కోసం ఆకాశంకేసి ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నకు ఉపశమనం లభించింది. రెండురోజులుగా వానలు జోరుగా కురుస్తున్నాయి.
హయత్‌నగర్‌లో అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం
సాక్షి, హైదరాబాద్: చినుకు కోసం ఆకాశంకేసి ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నకు ఉపశమనం లభించింది. రెండురోజులుగా వానలు జోరుగా కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వికారాబాద్‌లో 8, నిజామాబాద్ జిల్లా పిట్లంలో 6, మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు, ఆలంపూర్, రంగారెడ్డి జిల్లా మర్పల్లి, నల్లగొండ జిల్లా భువనగిరి, నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్‌లలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ప్రభావంతో నాలుగైదు రోజులు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.