సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఫిర్యాదుపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆప్ నేత కుమార్‌విశ్వాస్‌కు జారీ చేసిన సమన్లపై స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. తనతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు వస్తోన్న పుకార్లను కుమార్ విశ్వాస్ ఖండించడం లేదని ఓ ఆప్ మహిళా కార్యకర్త ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుతో తన ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని మహిళా కమిషన్ విశ్వాస్‌ను మే 4న తిరిగి 6న ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ సమన్లను సవాలుచేస్తూ కుమార్ విశ్వాస్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఆయన అప్పీలును తిరస్కరించింది. ఇదిలా ఉండగా కుమార్ విశ్వాస్‌కు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్ఖాసింగ్‌ను ఎందుకు చైర్‌సర్సన్ పద వి నుంచి తొలగించరాదో తెలియచేయాలని కోరుతూ ఢిల్లీ సర్కారు ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఆప్ నేత కుమార్ విశ్వాస్‌కు ఎదురుదెబ్బ
Published Sat, May 16 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement