1993 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్(53), మరో ఇద్దరు నేరస్తుల శిక్షను...
న్యూఢిల్లీ: 1993 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్(53), మరో ఇద్దరు నేరస్తుల శిక్షను తగ్గించే అంశంపై మీ అభిప్రాయమేంటో చెప్పాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ కోరినట్లు సమాచారం. మానవతా దృక్పథంతో సంజయ్‌కి, 70 ఏళ్ల మహిళ సహా మరో ఇద్దరికి శిక్షా కాలం తగ్గించాలని ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) మార్కండేయ కట్జూ.. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పిటిషన్ అందజేశారు. దాన్ని ప్రణబ్ హోంశాఖకు పంపడంతో ఆ శాఖ రాష్ట్ర అభిప్రాయం కోరినట్లు తెలిసింది.