న్యూఢిల్లీ: హమ్ సఫర్ రైళ్లను భారతీయ రైల్వేశాఖ త్వరలో పట్టాలెక్కించనుంది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసిన ఆ శాఖ అధికారులు అక్టోబర్ 20 నుంచి హమ్ సఫర్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అయితే, సాధారణ ఎక్స్ ప్రెస్, మెయిళ్లతో పోల్చితే అదనంగా 20శాతం చార్జీ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు.. హమ్ సఫర్ పేరుతో ప్రత్యేక సర్వీసు(ఏసీ-3టైర్)ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణ ఏసీ-3 టైర్ కోచ్ లలో అందుబాటులో ఉండని సదుపాయాలు ఈ రైళ్లలో ఉంటాయని ఆయన తెలిపారు. మహారాజా ఎక్స్ ప్రెస్ కోచ్ లకు వినియోగించే వినైల్ షీట్ లను ఈ రైళ్లలోని సీట్ల తయారీకోసం వినియోగించారు. రైలు అందంగా కనిపించేందుకు సరికొత్త ఇంటీరియర్ ను సమకూర్చారు.
సౌకర్యాలు
1.టీవీ
2.జీపీఎస్ (ప్రయాణికుడి వివరాలను తెలుసుకునేందుకు)
3.ఫైర్ అండ్ స్మోక్ డిటెక్షన్ సిస్టం
4.సప్రెషన్ సిస్టమ్స్
5.ప్రతి బెర్తుకు ల్యాప్ టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు ఉంటాయి.
త్వరలో పట్టాలెక్కనున్న కొత్త రైలు
Published Sun, Sep 11 2016 5:17 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
Advertisement