గొడ్డళ్లతో భార్యాభర్తల కొట్లాట.. ఇద్దరూ హతం
బెట్టియా(బిహార్): వాగ్వాదం తారస్థాయికి చేరి ఒకరిపై మరొకరు గొడ్డళ్లతో దాడి చేసుకోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని దక్షిణ చంపారన్ జిల్లా బాన్స్‌బరియా పీపల్ చౌక్ గ్రామానికి చెందిన దంపతులు సోహన్ షా(58), బదామీ దేవి(46) మనస్పర్ధలతో గ్రామం నుంచి వచ్చి పాలం పట్టణంలోని తమ ఫామ్‌హౌజ్‌లో నివసిస్తున్నారు. బుధవారం వారి మధ్య గొడవ జరిగింది. గొడ్డళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వారి కొడుకు బిశర్జన్ కుమార్(15) వచ్చేసరికి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయి రక్తపుమడుగులో ఉన్నారు.