
నేను ప్రధానమంత్రిని కాను.. ప్రధాన సెంట్రీని
తాను ప్రధానమంత్రిని కానని, ఈ దేశానికి ప్రధాన సెంట్రీనని నరేంద్ర మోదీ చెప్పారు. తన ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని మథురలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
- గడిచిన ఏడాదికాలంలో ఒక్క స్కాం కూడా జరగలేదు
- 29 బొగ్గు క్షేత్రాలను వేలం వేయడం వల్ల రూ. 3 లక్షల కోట్లువచ్చాయి.
- గత ప్రభుత్వంలో రూ. 2 లక్షల కోట్ల మేర బొగ్గు స్కాం జరిగింది
- ఇంతకుముందు బొగ్గు క్షేత్రాలను కారు చవగ్గా ఇచ్చేశారు
- మా ప్రభుత్వం పేదల కోసమే అంకితం
- మహాత్మా గాంధీ, రాం మనోహర్ లోహియా, దీనదయాళ్ ఉపాధ్యాయ.. ఈ ముగ్గురే భారత రాజకీయాలను ప్రభావితం చేశారు
- విచ్చలవిడిగా సాగుతున్న దోపిడీకి నేను అడ్డుకట్ట వేశాను
- యూపీఏ పాలనాకాలంలో ప్రతిరోజూ ఒక స్కాం జరగలేదా?
- అవి చెడ్డ రోజులు కావా.. వాళ్లు చేసినవి చెడ్డపనులు కావా?
- గతంలో దేశాన్ని దోచుకున్నవాళ్లకు ఇక రోజులు మూడాయి.
- 2014లో ఎన్నికలు జరగకపోతే భారతదేశం మొత్తం దోపిడీకి గురయ్యేది
- యూపీఏ ప్రభుత్వం అంతా 'రిమోట్ కంట్రోల్' ప్రభుత్వం
- 12కోట్ల మందికి వాళ్ల బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ అందుతోంది.
- ఇంతకుముందు కోట్లాది సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముడయ్యేవి.. ఇప్పుడు దానికి అడ్డుకట్ట పడింది.
- ప్రభుత్వ ఖజానాను దోచుకునే దొంగలకు కాలం చెల్లింది
- స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా రైతులకు ఆందోళన తప్పడంలేదు
- వాల్ల భూముల నుంచి రావల్సినంత ఉత్పాదకత రావట్లేదు
- దాంతో సాయిల్ హెల్త్ కార్డులు ప్రవేశపెట్టి, రాబోయే మూడేళ్లలో దేశంలో ప్రతి ఒక్క రైతుకు వాటిని అందిస్తాం.
- వాళ్ల భూమికి ఏ సమస్య ఉంది.. ఏ మందు వేయాలన్న విషయాలన్నీ తెలియజేస్తాం.
- పిల్లలకు ఏమందులు వేయాలి, ఏవి వద్దో డాక్టర్లు చెప్పినట్లే.. భూముల ఆరోగ్యం గురించి కూడా అలాగే చెప్పిస్తాం
- రాబోయే ఏడేళ్లలో నదుల అనుసంధానం లాంటి ప్రధాన కార్యక్రమాలన్నీ పూర్తిచేస్తాం.