
'రాష్ట్రపతి రేసులో లేను'
నాగపూర్: తాను రాష్ట్రపతి పదవికి రేసులో ఉన్నట్టు వచ్చిన వార్తలను బీజేపీ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్ బుధవారం ఖండించారు. ఇలాంటి వార్తలన్నీ వినోదం కోసం సృష్టించినవేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పేరు రాష్ట్రపతి పదవికి పరిశీలనకు రాదని, వచ్చినా తాను తిరస్కరిస్తానని అన్నారు. నాగపూర్‌లోని రాజ్‌వాడా ప్యాలస్‌లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను ఆర్‌ఎస్‌ఎస్, సమాజసేవకే పరిమితమవుతానని భాగవత్ అన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది.