
ఎస్‌ఎంఎస్ ద్వారా వాతావరణ సూచన
న్యూఢిల్లీ: వాతావరణంలో భారీ వర్షాల వంటి తీవ్రమైన మార్పులు సంభవించినప్పుడు అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ రూపంలో రైతులకు అందించే సేవలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. వడగండ్లవాన, భారీ వర్షాల వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతి మూడు గంటలకోసారి రైతులకు వారి మొబైల్‌ఫోన్‌లకు ‘నౌకాస్ట్’ పేరుతో సమాచారం అందుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ తెలిపారు.
దీంతో పాటుగా పంటలకు బీమా చేసుకునేలా రైతులను చైతన్య పరచటానికి ఒక వెబ్ పోర్టల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఉచిత ఎస్‌ఎంఎస్ సర్వీసులను పొందటానికి రైతులు ప్రభుత్వానికి సంబంధించిన ఝఓజీట్చఞౌట్ట్చలో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది.