- ఎమ్మెల్యేల అరెస్ట్‌ను ఖండించిన కాంగ్రెస్, బీజేపీ
- యథావిధిగా ప్రశ్నోత్తరాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శాసనమండలిలో విపక్షాలు వాకౌట్ చేశాయి. రైతుల రుణమాఫీని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలని కోరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ ధ్వజమెత్తారు. చట్ట సభల సాక్షిగా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుండ టానికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల అరెస్ట్‌ను ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు కూడా వాకౌట్ చేశారు.
విపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ ప్రశ్నోత్తరాలను యథావిధిగా కొనసాగించారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న 10 లక్షమంది కార్మికులకు (డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు) ప్రమాదబీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని, దీనికోసం రూ.5 కోట్ల ప్రీమియాన్ని చెల్లించామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి.. ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు.
తెలంగాణ తిరుపతిగా యాదాద్రి
యాదగిరిగుట్ట (యాదాద్రి)లో లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానం తెలంగాణ తిరుపతిగా రూపుదిద్దుకోబోతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. వాస్తు శాస్త్ర ప్రకారం కొండ శిఖరంపై దివ్యక్షేత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.
సింగూరు ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరి హారం ఇప్పిస్తామని.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములునాయక్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా మంత్రి హరీశ్‌రావు చెప్పారు. బాలకార్మికుల చదువు, పునరావాసానికి సంబంధించిన వ్యవహారాలను కార్మికశాఖ నుంచి విద్యాశాఖకు బదలాయించే ఆలోచన ఉందనిమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఐఏఎస్, ఎమ్మెల్యేల ఇళ్లల్లో బాలకార్మికులు పనిచేయకుండా చూడాలని టీఆర్‌ఎస్ సభ్యుడు రాములు నాయక్ కోరారు.
మండలిలో విపక్షాల వాకౌట్
Published Fri, Oct 2 2015 12:53 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement