రా.. రమ్మంటున్న ఆస్ట్రేలియా అందాలు | Increasing Telugu tourists in Australia | Sakshi
Sakshi News home page

రా.. రమ్మంటున్న ఆస్ట్రేలియా అందాలు

Published Sun, Jul 9 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

రా.. రమ్మంటున్న ఆస్ట్రేలియా అందాలు

రా.. రమ్మంటున్న ఆస్ట్రేలియా అందాలు

- ఆసీస్‌లో పెరుగుతున్న తెలుగు పర్యాటకులు
- క్వీన్స్‌ల్యాండ్‌ అందాలకు  ఫిదా అవుతోన్న హైదరాబాదీలు
- నగరం నుంచి  టైగర్‌ఎయిర్‌ – స్కూట్‌ సర్వీసులు ప్రారంభం


సాక్షి, హైదరాబాద్‌:
కంగారూ..క్రికెట్‌తో పాటు ఆ దేశంలో  ప్రస్తుతం ఓ గోల్డ్‌కోస్ట్‌ క్రేజ్‌ క్రియేట్‌ చేస్తోంది..నేచర్,అడ్వెంచర్‌ టూరిజానికి కొత్త కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. అతితక్కువ వ్యయంతో మిడిల్‌ క్లాస్‌ సైతం ఆస్ట్రేలియా దేశం బ్రిస్బేన్‌ దగ్గర్లోని బంగారుతీరం, ఆకాశాన్నితాకేలా ఉండే క్యూ బిల్డింగ్, ఆకాశాన్ని చుట్టొచ్చే హాట్‌ ఎయిర్‌బెల్లూన్లు,  క్వీన్స్‌ ల్యాండ్‌ ఆకుపచ్చని అందాలను తనివి తీరా చూసొస్తున్నారు..తెలుగు రాష్ట్రాల పర్యాటకుల సంఖ్య అమాంతం పెరిగిపోవటంతో ఇటీవలే టైగర్‌ ఎయిర్‌ – స్కూట్‌ సంస్థలు హైదరాబాద్‌ నుండి సింగపూర్‌ – గోల్ట్‌కోస్ట్‌కు ప్రత్యేక విమానాన్ని ప్రారంభించి టూరిస్ట్‌లకు కంగారూ, క్రికెట్‌తో పాటు గోల్డ్‌కోస్ట్‌ అందాలను చేరువ చేసింది.

సీ వరల్డ్‌ రిసార్ట్‌..
మన భారతీయుడు ప్రకాష్‌ మేనేజర్‌గా ఉన్న థీమ్‌పార్క్‌ ఇది.  డాల్ఫిన్‌ విన్యాసాలు, హెలికాప్టర్‌లో గోల్డ్‌కోస్ట్‌ విహంగ వీక్షణం, రోలర్‌కోస్టర్, సీల్‌  కామెడీ షోలు, పెంగ్విన్‌ మొదలైన వాటికి నెలవు ఇది. షార్క్‌చేపలతో ఉన్న అక్వేరియం సీవరల్డ్‌ ప్రత్యేక ఆకర్షణ. చిన్న సైజు సముద్రాన్ని తలపించే ఇందులో షార్క్‌ చేపలతో పాటు స్టార్, సీ హార్స్‌లాంటి రకరకాల జీవులనూ చూడొచ్చు. డాల్ఫిన్‌కు సంకేతాలిస్తూ వాటిని ఆడించే శిక్షకులు అమ్మాయిలు కావడం విశేషం. ఒక్క డాల్ఫిన్‌ విన్యాసాలే కాదు.. ఇలాంటివింకెన్నో సాహసక్రీడలను ఇక్కడున్న నిర్వహిస్తున్నది మహిళలే.  

హట్‌ ఎయిర్‌ బెలూన్‌
హాట్‌ ఎయిర్‌తో బెలూన్‌నింపి... టూరిస్ట్‌లను తొట్టిలో కూర్చోబెట్టి ఆకాశంలో విహరింపచేసేదే  హాట్‌ ఎయిర్‌ బెలూన్‌. ఉదయం నాలుగున్నరకు మాత్రమే ఉంటుంది ఈ విహారం. ఎందుకంటే పొద్దున పూట వీచే గాలి ఈ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. దాదాపు మూడు వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్తుందీ బెలూన్‌. గోల్డ్‌కోస్ట్‌లో సూర్యోదయాన్ని ఆకాశంలో విహరిస్తూ చూసే అద్భుత అవకాశం ఈ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ కల్పిస్తుంది.

ఇంకొన్ని...
ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోరల్‌ రీఫ్‌ అంటే పగడపు దీవులు ఇక్కడే కొలువై ఉంది.  జాకీచాన్‌ లాంటి స్టార్స్‌కి ఇక్కడి ఐల్యాండ్స్‌లో విశ్రాంతి భవనాలున్నాయి. షాపింగ్‌ అండ్‌ రెస్టారెంట్స్‌కి ... సర్ఫర్స్‌ ప్యారడైస్‌ సెంటర్‌. ఇక్కడే డ్యాకూలాస్‌ హౌజ్‌ అనే స్టాండప్‌ కమెడీ షో జరిగే థియేటర్‌ ఉంటుంది. డిన్నర్‌ చేస్తూ ఈ షోను చూడడం దీని స్పెషాలిటీ. అలాగే ఫైర్‌ పర్‌ హైర్‌ ఒకటి. నిరుపయోగంగా ఉన్న ఫైర్‌ ఇంజన్‌ వాన్‌ను గోల్డ్‌కోస్ట్‌ నగరాన్ని తిప్పడానికి ఉపయోగిస్తారు.. అదే ఫైర్‌ ఫర్‌ హైర్‌. పిల్లలయితే బాగా ఎంజాయ్‌ చేస్తారు. గోల్డ్‌కోస్ట్‌ బాలివుడ్‌ సినిమాలకూ మంచి షూటింగ్‌ స్పాట్‌గా మారింది. దిల్‌ చహతాహై వంటి ఎన్నో హిందీ చిత్రాలు ఇక్కడే ఫ్రేమ్‌సెట్‌ చేసుకున్నాయి. చెప్పాలంటే చాలా ఉన్నాయి. అలాగే చూడ్డానికీ కనీసం వారం రోజులైనా కావాలి. కాబట్టి లాంగ్‌ వెకేషన్స్‌ కి ప్లాన్‌ చేసుకుంటే బాగుంటుంది.

బంగారు తీరానా..ఆకాశహర్మ్యాలు
గోల్డ్‌కోస్ట్‌.. ప్రకృతిని ప్రేమించే వాళ్లకు నిజంగా బంగారు తీరమే! నీల సంద్రం.. ఒడ్డున ఆకాశహరŠామ్యలు.. మధ్యలో చిక్కటి అడవులు.. మనసును ఆహ్లాదపరుస్తాయి.. మనిషికి ఉల్లాసాన్నిస్తాయి! ఆస్ట్రేలియాలో ఓ రాష్ట్రం క్వీన్స్‌ ల్యాండ్‌. దాని రాజధాని బ్రిస్‌బేన్‌ దగ్గర్లో ఉంటుందీ గోల్డ్‌కోస్ట్‌ తీరం!  అతిగా ఎండ, అతిగా చలి లేని సమశీతోష్ణస్థితి ... దీని ప్రత్యేకత! 260 కిలోమీటర్ల పొడవునా జల రహదారులున్నాయి.  దాదాపు లక్ష హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. 365 రకాల వినోద విన్యాసాలు, 500 రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రపంచ పర్యాటకులు ముఖ్యంగా భారతీయులను అమితంగా ఆకట్టుకుంటోంది. దుబాయ్, థాయ్, మలేషియాలను తలదన్నే రీతిలో మనవాళ్ల వాండర్‌లస్ట్‌ను తీరుస్తున్నది గోల్డ్‌కోస్టే. పిల్లలను అలరించే థీమ్‌పార్కులు, పెద్దలకు వినోదం అందించే స్టాండప్‌కమెడీ షోలు, చిన్నాపెద్దాను ఉత్సాపరిచే సాహసక్రీడలు.. మరచిపోలేని అనుభూతిని పంచుతాయి.

మౌంట్‌ టాంబరీన్‌
అభయారణ్యాలతో కూడుకున్న హిల్‌ స్టేషన్‌ ఇది. గోల్డ్‌కోస్ట్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  ఎత్తయిన చెట్లు.. చల్లటి గాలి.. సెలయేర్లు.. మ్యూజియంతో పర్యాటకులను అలరిస్తో్తంది. సాహసకృత్యాలకూ ఇదీ నెలవే. జిప్‌ లైన్, ట్రీ టాప్‌ చాలెంజెస్‌కు ప్రసిద్ధి. భూమికి 60 కిలోమీటర్ల ఎత్తున ఈ దరి నుంచి ఆ దరికి కట్టిన వైర్ల సహాయంతో ఈ కొస నుంచి ఆ కొసకు జిప్‌ మంటూ  దూసుకెళ్లడమే జిప్‌లైన్‌. అంచెలంచెలుగా దాదాపు కనీసం 15 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. అంతెత్తున సర్రున సాగిపోతుంటే ఒక్కసారిగా గుండె జారినట్టనిపిస్తుంది. కాని రెండో అంచెకు ఉత్సాహం పెరుగుతుంది. మూడో దశకు ఆ సాహసం ఇంకాస్త దూరం.. ఇంకాస్త ఎత్తునుంచి చేస్తే బాగుండు అనిపిస్తుంది. అదే ఈ జిప్‌లైన్‌ స్పెషాలిటీ. ఇక్కడా చైనిస్, థాయ్‌ మొదలు భారతీయ రెస్టారెంట్లూ ఉన్నాయి. భారతీయ రెస్టారెంట్లలో కేరళ జంట నడిపే మసాలా శాంతి చాలా ఫేమస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement