యాంటీ చైనాతో జతకడుతారా? తస్మాత్ జాగ్రత్త! | India Needs to be Vigilant About Joining Anti-China Camp: Chinese Daily | Sakshi
Sakshi News home page

యాంటీ చైనాతో జతకడుతారా? తస్మాత్ జాగ్రత్త!

Published Wed, Oct 14 2015 5:54 PM | Last Updated on Mon, Aug 13 2018 3:35 PM

యాంటీ చైనాతో జతకడుతారా? తస్మాత్ జాగ్రత్త! - Sakshi

యాంటీ చైనాతో జతకడుతారా? తస్మాత్ జాగ్రత్త!

బీజింగ్: యాంటీ చైనా కూటమితో జతకట్టే విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని చైనా మీడియా పేర్కొంది. "మలబార్' భారత్-అమెరికా నౌకాదళ విన్యాసాల్లో జపాన్ కూడా పాలుపంచుకుంటున్న నేపథ్యంలో ఆ దేశ మీడియా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు ప్రస్తుతం చక్కగా ఉన్నాయని పేర్కొంది.

'చైనా-భారత్ సంబంధాలు చక్కనిపథంలో ముందుకుసాగుతున్నాయి. ఆరోగ్యకరమైన సంబంధాల వల్ల ఇరుదేశాలూ లబ్ధిపొందుతాయి. ఈ నేపథ్యంలో యాంటీ చైనా క్యాంప్లో జతకలిసే విషయంలో భారత్ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి' అని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. ఏకకాలంలో భారత-చైనా సైనిక విన్యాసాలు, మలబార్ త్రైపాక్షిక డ్రిల్స్ జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించింది.

హ్యాండ్ ఇన్ హ్యాండ్- 2015 పేరిట ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-చైనా సైన్యాల సంయుక్త విన్యాసాలు చైనాలోని యునాన్ ప్రావిన్స్ కున్మింగ్ పట్టణంలో జరుగుతున్నాయి. అదేసమయంలో బంగాళాఖాతంలో భారత్, అమెరికా, జపాన్ నౌకాదళాల సంయుక్త యుద్ధ క్రీడలు కూడా కొనసాగుతున్నాయి. ఈ రెండు ఏకకాలంలో జరుగడం అనేక ఊహాగానాలకు తావిస్తున్నదని చైనా మీడియా వ్యాఖ్యానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement