భార్యను చంపేసిన ఎన్నారై? | Indian allegedly kills wife inside restaurant in US | Sakshi
Sakshi News home page

భార్యను చంపేసిన ఎన్నారై?

Published Thu, Apr 16 2015 10:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

భార్యను చంపేసిన ఎన్నారై? - Sakshi

భార్యను చంపేసిన ఎన్నారై?

వాషింగ్టన్:  అమెరికాలోని ఒక హెటల్ వంటగదిలో  భారతీయ మహిళ హత్య కలకలం  రేపింది. 21 ఏళ్ల పాలక్ భద్రేష్ కుమార్  పటేల్  మేరీలాండ్ లోని  డంకెన్  డోనట్స్  రెస్టారెంట్  కిచెన్లో ఆదివారం శవమై కనిపించింది. విధినిర్వహణలో ఉన్న ఒక పోలీసు ఆఫీసర్ హెటల్ను సందర్శించినపుడు  విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను తీవ్రంగా కొట్టి చంపేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో  తేలింది.  అప్పటి నుంచి ఆమె భర్త చేతన్భాయ్ పటేల్ ఆచూకీ లేదు. దీంతో పోలీసులు ఆమె భర్త పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  
 

కాగా భార్యాభర్తలిద్దరూ డంకెన్స్  డోనట్స్   హోటెల్లోనే పనిచేస్తున్నట్టుగా సమాచారం.  కేసు  నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం  గాలిస్తున్నారు.  కేసును  సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతిని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement