ఇన్ఫోసిస్ ట్రేడ్‌ఎడ్జ్ ప్రారంభం | Infosys launches sales platform TradeEdge | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ ట్రేడ్‌ఎడ్జ్ ప్రారంభం

Published Tue, Dec 10 2013 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

ఇన్ఫోసిస్ ట్రేడ్‌ఎడ్జ్ ప్రారంభం

ఇన్ఫోసిస్ ట్రేడ్‌ఎడ్జ్ ప్రారంభం

బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ప్రోడక్ట్ ప్లాట్‌ఫామ్, ట్రేడ్‌ఎడ్జ్‌ను సోమవారం ప్రారంభించింది. ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్లోని గ్లోబల్ బ్రాండ్స్ వర్ధమాన దేశాల్లో లాభదాయకత పెంపునకు ఈ ట్రేడ్‌ఎడ్జ్ ఉపయోగపడుతుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్.ఆర్. నారాయణ మూర్తి తెలిపారు.
 
  వినియోగదారుల డిమాండ్‌ను అందుకునే మార్గాలను సూచించడమే కాకుండా అమ్మకాలు మెరుగుపరచుకోవడం, నిర్వహణ సామర్థ్యం పెంపు తదితర అంశాలపై ఈ క్లౌడ్ ఆధారిత ట్రేడ్‌ఎడ్జ్ తగిన సూచనలిస్తుందని వివరించారు. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మెకిన్సే అంచనాల ప్రకారం..., అంతర్జాతీయ రిటైల్ వినియోగం 2025 కల్లా 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇది అంతర్జాతీయ డిమాండ్‌లో దాదాపు సగానికి సమానం. ఈ పరిస్థితి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమ్మకాలు పడిపోతున్న ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ వంటి రిటైల్ సంస్థలకు మంచి అవకాశమని మెకిన్సే పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement