
ఆప్ నేతకు ‘ఇంక్’ సెగ
న్యూఢిల్లీ: సహారా సంస్థల అధిపతి సుబ్రతారాయ్‌పై ఓ న్యాయవాది ఇంక్ చల్లిన ఘటన మరువక ముందే.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నేత యోగేంద్ర యాదవ్ కూడా అలాంటి నిరసనే సొంత పార్టీ కార్యకర్త నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో యోగేంద్రయాదవ్ మీడియాతో మాట్లాడుతుండగా.. జనంలోంచి వచ్చిన 28ఏళ్ల యువకుడు.. భారత్ మాతాకీ జై అని నినదిస్తూ యాదవ్ ముఖానికి ఇంక్ పూశాడు. దీంతో కార్యకర్తలు అతనికి దేహశుద్ధి చేశారు. ఆప్ కార్యకర్తలను పోలీసులు నిలువరించి నిందితుడిని పార్లమెంటు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, ఆ వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దని యాదవ్ పోలీసులను కోరడం విశేషం. దీన్ని మరచిపోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.