హైదరాబాద్: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఇరాన్‌కు మధ్య ఓ ఒప్పందం కుదిరింది. మంగళవారం రవీంద్రభారతి ప్రాంగణంలోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. రాష్ట్రం తరఫున భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఇరాన్‌కి చెందిన సాంస్కృతిక ప్రజా సంబంధాల అధికారి అలీ ఎ నిరూమాండ్, అలీ పర్గడ్ తదితరులు పాల్గొని చర్చించారు. ఒప్పందం ప్రకారం ఈ నెల 26న రవీంద్రభారతిలో ఇరాన్ కళాకారులు ఓ వినూత్న సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ ప్రయత్నం దీర్ఘకాలం కొనసాగుతుందని, బయటి దేశాల కళారూపాలను తాము స్వాగతిస్తున్నామని హరికృష్ణ తెలిపారు. అలాగే తెలంగాణ కళారూపాలను కూడా ఇరాన్ ఇదేవిధంగా గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ కళారూపాలను ప్రపంచ వ్యాప్తం చేసే ఆలోచనతో సాంస్కృతిక జైత్రయాత్రను నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు.
ఇరాన్‌తో ‘సాంస్కృతిక’ ఒప్పందం
Published Wed, Jul 15 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM
Advertisement