
సంబరాల్లో బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు సంబరాల్లో మునిగిపోతున్నారు. షాహిద్ భార్య మీరా శుక్రవారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రిగా ప్రమోషన్ పొందిన షాహిద్ ట్విట్టర్ లో అభిమానులతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. అటు ఈ దంపతుల కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. తమ కుటుంబంలోకి వచ్చి చేరిన బుజ్జిపాపాయిని ఆనందంగా ఆహ్వానించడానికి అటు కుటుంబ సభ్యులు ఇటు నటులు పంకజ్ పాథక్, సుప్రియా పాథక్ తదితరులు హుటా హుటిన ఆసుపత్రికి తరలి వెళ్ళారు. బాలీవుడ్ హీరోహీరోయిన్లు, పరిశ్రమకు చెందినపలువురు షాహిద్ ను అభినందనల్లో ముంచెత్తారు. దియామీర్జా , అనుష్క శర్మ, అజయ్ దేవగన్, ఫరిఖాన్ తదితరులు ఈ కోవలో ఉన్నారు.
మరవైపు షాహిద్ మీర్జా దంపతులకు ట్విట్టర్ లో అభినందనల వెల్లువ కురుస్తోంది. దీంతో తమకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తూ ట్వీట్ చేశారు. తమకెంతో ఆనందంగా ఉందని, ఆ సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నానంటూ ట్వీటారు షాహిద్.
కాగా హైదర్ చిత్రంతో ఉత్తమ నటుడి అవార్డు గెల్చుకున్న షాహిద్ గత ఏడాది జులైలో ఢిల్లీ కిచెందిన మీరాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
She has arrived and words fall short to express our happiness. Thank you for all your wishes.
— Shahid Kapoor (@shahidkapoor) August 26, 2016
Congratulations @MiraRajput and @shahidkapoor ❤️ love and light to your precious little one. Can't wait to see her!
— Dia Mirza (@deespeak) August 27, 2016
Heartfelt Congratulations 2 Mira n @shahidkapoor .. God bless ur lil Angel.. N any advice u need I'm thrice qualified