జల్లికట్టు ప్రాధాన్యం అద్భుతం: మోదీ
జల్లికట్టు ప్రాధాన్యం అద్భుతం: మోదీ
Published Thu, Jan 19 2017 12:17 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
జల్లికట్టుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యం అద్భుతమని.. అయితే ఆ విషయం కోర్టులో ఉన్నందున దాని గురించి ఇప్పుడేమీ మాట్లాడలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తనను కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి వీలైన అన్ని రకాలుగా సాయం చేస్తామని తెలిపారు. జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు వ్యాప్తంగా భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. చెన్నై మెరీనా బీచ్‌లో కూడా నిరనసకారులు మూడు రోజుల నుంచి అక్కడే ఉండి జల్లికట్టుకు అనుమతి వస్తే తప్ప అక్కడినుంచి కదిలేది లేదంటున్నారు. దాంతో స్పందించిన సీఎం పన్నీర్ సెల్వం హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీచేయాలని కోరారు.
అలాగే తమిళనాడులో ఉన్న కరువు పరిస్థితుల మీద కూడా ప్రధాని - ముఖ్యమంత్రి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రాన్ని తాము ఆదుకుంటామని, త్వరలోనే కేంద్రబృందాన్ని తమిళనాడుకు పంపుతామని ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోడానికి కావల్సిన అన్నిరకాల చర్యలు కేంద్రం తీసుకుంటుందని ప్రధాని కార్యాలయం తెలిపింది.
Advertisement
Advertisement