
'కుట్ర కేసులతో అధికారానికి దూరమయ్యా'
చెన్నై: రాజకీయ కుట్రతో పెట్టిన కేసులతో కొంతకాలం అధికారానికి దూరమయ్యానని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. ప్రజల పూజలే తనను కాపాడాయని చెప్పారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఎన్నూరు జంక్షన్ లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనను భారీ మెజార్జీతో గెలిపించాలని అభ్యర్థించారు. తనను గెలిపిస్తే రేయింబవళ్లు పనిచేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని హామీయిచ్చారు. పేదల కన్నీళ్లు తుడుస్తానని అన్నారు. తన ప్రత్యర్థిగా పోటీలో ఉన్న సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ కు డిపాజిట్ రాకుండా చేయాలని ఆమె భావిస్తున్నారు. ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 27న ఉప ఎన్నిక జరగనుంది.