కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఉద్యోగాలు
కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్.. మార్కెటింగ్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 25 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 4. వివరాలకు www.kvb.co.in చూడొచ్చు.
ఎంఎన్‌ఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు
జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఐటీ).. నాన్ టీచింగ్ విభాగంలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 34. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 6. వివరాలకు www.mnit.ac.in చూడొచ్చు.
పోస్టల్ డిపార్‌టమెంట్‌లో స్పోర్‌ట్స కోటాలో..
డిపార్‌టమెంట్ ఆఫ్ పోస్ట్స్ కర్ణాటక సర్కిల్.. స్పోర్‌ట్స కోటాలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 26. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 20. వివరాలకు www.indiapost.gov.in చూడొచ్చు.
బెంగళూరు ఈఎస్‌ఐసీలో ఖాళీలు
బెంగళూరులోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్స్/ఫుల్‌టైం స్పెషలిస్ట్/పార్‌టటైం స్పెషలిస్ట్, పార్‌ట టైమ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 19. ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 3, 4. వివరాలకు www.esipgirnr.kar.nic.in చూడొచ్చు.
ఢిల్లీ నిట్‌లో ఫ్యాకల్టీ
ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ (ఖాళీలు-5), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-10) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.nitdelhi.ac.in చూడొచ్చు.
రామ్‌జాస్ కాలేజీలో నాన్ టీచింగ్ అసిస్టెంట్లు
ఢిల్లీలోని రామ్‌జాస్ కాలేజ్.. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఖాళీలు-1), సీనియర్ అసిస్టెంట్ (ఖాళీలు-1), అసిస్టెంట్ (ఖాళీలు-1), జూనియర్ అసిస్టెంట్ (ఖాళీలు-3), ప్రొఫెషనల్ అసిస్టెంట్ (ఖాళీలు-1), ల్యాబ్ అసిస్టెంట్ (ఖాళీలు-4), ఎంటీఎస్ (ఖాళీలు-3) పోస్టుల భ ర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 13. వివరాలకు www.ramjascollege.edu చూడొచ్చు.
ప్లాంట్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్.. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్‌చ అసోసియేట్ (ఖాళీలు-5), సీనియర్ రీసెర్‌చ ఫెలో (ఖాళీలు- 6) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 26. వివరాలకు niphm.gov.in చూడొచ్చు.
రాజస్థాన్ ఓఎన్‌జీసీలో జూనియర్ అసిస్టెంట్లు
రాజస్థాన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) జోధ్‌పూర్ ఫ్రంటియర్ బేసిన్.. వివిధ విభాగాల్లో ఏ-2 లెవల్ (ఖాళీలు-1), ఏ-1 లెవల్ (ఖాళీలు-8) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖా స్తుకు చివరి తేది నవంబర్ 6. వివరాలకు www.ongcindia.com చూడొచ్చు.
‘సెంట్రల్ మైన్ ప్లానింగ్’లో వికలాంగులకు...
రాంచీలోని సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 14. వివరాలకు www.cmpdi.co.in చూడొచ్చు.