కశ్మీర్ ఎన్నికల ఘనత ఆ రాష్ట్ర ప్రజలదే: మోదీ | kashmir elections credit goes to the people only, says modi | Sakshi
Sakshi News home page

కశ్మీర్ ఎన్నికల ఘనత ఆ రాష్ట్ర ప్రజలదే: మోదీ

Published Wed, Mar 4 2015 12:52 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

kashmir elections credit goes to the people only, says modi

 కశ్మీర్ సీఎం వ్యాఖ్యలను సమర్థించం
 న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ నిర్ద్వంద్వంగా ఆక్షేపించారు.  ఎవరైనా అటువంటి వ్యాఖ్యలు చేస్తే  ఎన్నటికీ వాటికి మద్దతివ్వలేమని స్పష్టంచేశారు. సయీద్ ఆదివారం కశ్మీర్ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత.. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి కారణం పాక్, హురియత్, ఉగ్రవాదులేనని పేర్కొనడం తెలిసిందే. దీనిపై మోదీ సమాధానం చెప్పాలని రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేయటంతో ఆయన మంగళవారం  స్పందించారు. ఎన్నికల నిర్వహణ విజయవంతమైన ఘనత.. అసమాన ధైర్యంతో, గర్వంతో భారీ సంఖ్యలో వచ్చి.. ఇంత కాలం భారత్ చెప్తున్న దానిని ఆమోదిస్తూ తమ ముద్ర వేసిన ఆ రాష్ట్ర ప్రజలకే చెందుతుందన్నారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement