సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్తు ప్రాజెక్టు పనులు 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి వి.నారాయణస్వామి తెలిపారు. 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు కొవ్వాడలో నిర్మితమవుతాయన్నారు. ఆయన బుధవారమిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం దేశంలో 4,780 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల 20 అణువిద్యుత్తు ప్లాంట్లు నడుస్తున్నాయని, మరో 5,300 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటి నిర్మాణంతో 2017 నాటికి 10,080 మెగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుదుత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరోవైపు 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరో 17,400 మెగావాట్ల సామర్థ్యం గల ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం ప్రారంభమై.. 13, 14 పంచవర్ష ప్రణాళికల కాలంలో అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు.
12వ ప్రణాళికలోనే ‘కొవ్వాడ’: నారాయణస్వామి
Published Thu, Jan 16 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement