ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికార ఉమేష్ సిన్హా శనివారం లక్నోలో వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 40 అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు.
అయా ప్రాంతాలలో పోలింగ్ బూత్లలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటింగ్ జరిగే మూడు రోజుల ముందే పోలింగ్ బూత్లలో ఆ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తాము గుర్తించిన 40 అత్యంత సున్నితమైన ప్రాంతాలు నగర, గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయన్నారు.