న్యూఢిల్లీ: ఈ నెల 25 నుంచి తలపెట్టిన సమ్మెను వంట గ్యాస్ డీలర్లు వాయిదా వేసుకున్నారు. డీలర్ల సమస్యలపై చర్చలు జరపడానికి ఆయిల్ కంపెనీలు ఓ ప్యానెల్ను ఏర్పాటు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఆలిండియా ఎల్పీజీ పంపిణీ దారుల సమాఖ్య, ఫెడరేషన్ ఆఫ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు సంయుక్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పంపిణీలో కొరత ఏర్పడిన సందర్భాల్లో తీసుకునే క్రమశిక్షణ చర్యలను నిరసిస్తూ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో గ్యాస్ డీలర్ల సంఘాలు, ఆయిల్ కంపెనీల మధ్య చర్చల కోసం సంయుక్త ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ఇందులోడీలర్ల సంఘాలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఉంటారు. వచ్చే నెల 31 లోపు నివేదిక సమర్పించనున్నారు.