నమ్మలేని నిజాన్ని చూస్తారా? | Lure Hsu, latest internet star | Sakshi
Sakshi News home page

నమ్మలేని నిజాన్ని చూస్తారా?

Published Wed, Jun 21 2017 5:13 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

Lure Hsu, latest internet star



తైపీ: ఇంటర్నెట్ లో లేటెస్ట్ స్టార్ గా మారుమోగుతోన్న పేరు.. లురే సు. ఫేస్ బుక్ లో 3.5 లక్షల మంది ఫాలోవర్లు.. ఇన్ స్టాగ్రామ్ లో 2.5 లక్షల మంది ఫాలోవర్లతో యావత్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోన్న ఈ అమ్మడిది తైవాన్. వయసు 42 ఏళ్లు!

చైనీస్ నటి షారోన్(35)కు అక్కైన లురే చాలా కాలంపాటు మీడియాకు దూరంగా ఉండిపోయింది. రెండేళ్ల కిందట ఓ సినిమా ఫంక్షన్ సందర్భంగా షారోన్.. లురేను వెంటతీసుకెళ్లి.. "ఈమె మా అక్కయ్య"అని పరిచయం చేయడంతో అంతా షాకయ్యారట!

ఆ తర్వాత రెండుమూడు మ్యాగజైన్లు లురేను ఇంటర్వ్యూ చేశాయి. క్రమంగా పాపులారిటీ పెరుగిపోతుండటం లురేలో ఉత్సాహాన్ని నింపింది. ఫొటోషూట్లు చేసి వాటిని అభిమానులకు షేర్ చేసింది. "నిజంగా మీ వయసు 42 అంటే నమ్మలేకపోతున్నా"మని కొందరు, "దివి నుంచి భువికొచ్చిన దేవత నువ్వు.."అని ఇంకొందరు లురేను పొడుగుతూఉంటారు. అంత వయసొచ్చినా ఇంత నాజూగ్గా ఉండటానికి గల కారణం.. ఫుల్లుగా నీళ్లు తాగడం, కూరగాయలు మాత్రమే తినడమని బ్యూటీ సీక్రెట్ చెబుతోంది లురే సు.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement