ఒక్క చెట్టు కోసం ఇంత ఖర్చా!
భోపాల్: మధ్యప్రదేశ్ లోని సాల్మాతూర్ జిల్లాలో ఒక్క రావిచెట్లు సంరక్షణకు ప్రభుత్వం ఏకంగా ఏడాదికి రూ.12 లక్షలు ఖర్చు చేస్తోంది. ఈ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన సాంచీ బౌద్ధ ప్రాంతానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఈ రావి చెట్టు ఉంది. ఎందుకంటే భారత దేశంలో ఇదే మొదటి వీవీఐపీ చెట్టు. ఈ చెట్టు ను శ్రీలంక మాజీ ప్రెసిడెంట్ మహేంద్ర రాజపక్షే ఐదు సంవత్సరాల క్రితం నాటరని చెబుతున్నారు.
2012 నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ మొత్తం నలుగురు గార్డులు పనిచేస్తున్నారు. ఈ ప్రాంతానికి ఇంతకు ముందు చాలా మంది వచ్చిపోయేవారని పరమేశ్వర్ తివారీ చెప్పారు. కానీ ప్రస్తుతం కొద్దిమంది మాత్రమే వస్తున్నట్లు హోమ్ గార్డు తెలిపాడు. ఈ వీవీఐపీ రావి చెట్టుకు నీరు పోయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేసింది.
అంతేకాక ఈ చెట్టు బాగోగులు చూడటానికి వ్యవసాయం విభాగం నుంచి ఒక వృక్షశాస్త్రజ్ఞుడు ప్రతివారం ఇక్కిడికి వస్తారట. చెట్టు పై ఇంత ఖర్చు చేయటాన్ని కొంత మంది పర్యావరనవేత్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంట్లో సగం రైతుల కోసం వెచ్చి ఉంటే బాగుండేదని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.