పశ్చిమబెంగాల్లో సవతి మనవరాలిపై అత్యాచారం జరిపిన కేసులో నిందితుడు మోహన్ తాప (50)కు డార్జిలింగ్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతీమ్ చక్రవర్తి జీవిత ఖైదీ విధించారు. రూ.50 వేల జరిమాన విధించారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని తెలిపారు. డార్జిలింగ్ సర్దార్ పోలీసు స్టేషన్ పరిధిలోని సింగమారి గ్రామం నివాసి అయిన మోహన్ తాపతో కలసి సవతి మనవరాలు నివసిస్తుంది.
అయితే పాఠశాల ఉపాధ్యాయురాలు బాలికలో వచ్చిన శారీరక మార్పులను గమనించింది. దాంతో బాలికను నిలదీయడంతో అసలు విషయం విషయం బయటపడింది. దీంతో ఉపాధ్యాయురాలు తల్లితండ్రులకు సమాచారం అందజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా చేసిన నేరాన్ని మోహన్ తాప ఒప్పుకున్నాడు.
2010 సెప్టెంబర్ నుంచి 2011 మే మధ్య కాలంలో మనవరాలిపై పలుసార్లు బలవంతంగా అత్యాచారం జరిపినట్లు అతడు అంగీకరించాడు. ఆ బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, బాలిక గర్బవతి అని వైద్య పరీక్షల ద్వారా వెల్లడైంది. 2012 జూన్లో ఆ బాలిక ప్రసవించింది. ఆ బాలిక ప్రస్తుతం కలింమ్పాంగ్లో మిషనర్సీ నడుపుతున్న పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తుంది.