
కిడ్నాప్ చేసి.. జీవిత కాలం జైలు
ఉత్తరప్రదేశ్: హత్య చేయాలనే ఉద్దేశంతో ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తికి జీవితం కాలం జైలు శిక్షపడింది. ఉత్తరప్రదేశ్లోని కింది స్థాయికోర్టు ఈ శిక్ష విధించింది. రాష్ట్రంలోని నాగ్లా సేవా గ్రామానికి చెందిన విక్రం సింగ్ అనే ఆరేళ్ల బాలుడిని అదే గ్రామానికి చెందిన పన్నా లాల్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన 2002లో చోటుచేసుకుంది.
దీంతో అదే ఏడాది జూన్ 11విక్రమ్ మేనమామ కేసు పెట్టారు. దీంతో పోలీసులు పన్నాలాల్ విషయంలో చాలా కష్టపడి ఆ బాలుడిని ప్రాణాలతో రక్షించారు. ఈ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా విచారణ చేపట్టిన కోర్టు జీవితకారాగార శిక్షను విధించింది. గతంలో కూడా పన్నాలాల్ ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంది.