
ప్రధాని అలా అనడం సరికాదు: అరుణ్ జైట్లీ
ఢిల్లీ: దేశంలో అవినీతిని అరికట్టడంలో విఫలమయ్యానని ప్రధాని మన్మోహన్ సింగే ఒప్పుకున్నారని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. మన్మోహన్ పరిపాలనలో ఉత్పత్తిదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన విమర్శించారు. మధ్యవర్తులు కోట్ల రూపాయలు గడించారని ఆరోపించారు. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయని చెప్పారు.
ఉద్యోగాలు కల్పించలేదన్న విషయాన్ని ప్రధాని మన్మోహన్ అంగీకరించారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన దర్యాప్తులో నరేంద్ర మోడీ నిర్దోషని తేలిందని చెప్పారు. నరేంద్ర మోడీని ప్రజలు నిర్దోషని మూడుసార్లు తీర్పిచ్చి గెలిపించారని తెలిపారు. దేశంలో ఏ రాజకీయ నేత మీదా ఇప్పటివరకూ ఇలాంటి దర్యాప్తులు జరగలేదని అరుణ్‌జైట్లీ గుర్తుచేశారు. మోడీనుద్దేశించి ప్రధాని అలా వ్యాఖ్యానించడం సరికాదని అరుణ్‌జైట్లీ అన్నారు.