'మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిని ఎంజాయ్ చేస్తున్నారు' | Manmohan singh is apathetic on economic decadence: Subramanian Swamy | Sakshi
Sakshi News home page

'మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిని ఎంజాయ్ చేస్తున్నారు'

Published Tue, Oct 22 2013 5:42 PM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

'మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిని ఎంజాయ్ చేస్తున్నారు'

'మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిని ఎంజాయ్ చేస్తున్నారు'

న్యూఢిల్లీ: ప్రధాని పదవిని మన్మోహన్ సింగ్ ఎంజాయ్ చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితి రోజు రోజూకు దిగజారిపోతుంటే ప్రధానికి ఏమాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రూపాయికి క్షీణతకు యూపీఏ విధివిధానాలే కారణమని ఆయన మండిపడ్డారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన మన్మోహన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఎంత త్వరతి గతిన లోక్ సభ ఎన్నికలకు వెళితే అంత తొందరగా దేశాన్ని కాపాడుకోగలుతామన్నారు.
 

ఈ విషయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే స్పందించి లోక్ సభ ఎన్నికలపై ప్రధానికి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు.  విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని వచ్చిన వెంటనే రాష్ట్రపతి లోక్ సభ ఎన్నికల అంశం చర్చించాలని నారాయణ స్వామి డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు తీసుకుంటున్న ఆర్థిక విదానాల సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement