భారీ ద్రవ్యోల్బణం, తగ్గిన ఉపాధి అవకాశాలు.. ఆదాయాలతో ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.
న్యూఢిల్లీ: భారీ ద్రవ్యోల్బణం, తగ్గిన ఉపాధి అవకాశాలు.. ఆదాయాలతో ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ కారణాల వల్ల దీపావళి పండుగ బడ్జెట్‌ను మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల వారు దాదాపు 40 శాతం తగ్గించుకోనున్నారు. అసోచాం నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించడం వల్ల నెలవారీ వాయిదా మొత్తాలు (ఈఎంఐ) పెరగడం, నిత్యావసరాల ధరలు ఎగియడం తదితర కారణాలతో చాలా మంది చేతిలో మిగులు డబ్బు లేకుండా పోతోందని సర్వేలో తేలింది. అయితే, అధికాదాయ వర్గాలపై మాత్రం రూపాయి పతనం, ద్రవ్యోల్బణ ప్రభావాలు పెద్దగా లేవని వెల్లడైంది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా తదితర నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు.