ఎట్టకేలకు జుకర్ బర్గ్ చేతికి డిగ్రీ పట్టా!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అధినేతగా, హార్వర్డ్ స్కూల్ డ్రాపవుట్గా అందరికీ సుపరిచితమైన మార్క్ జుకర్ బర్గ్ ఎట్లకేలకు డిగ్రీ పట్టా అందుకోబోతున్నారు.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అధినేతగా, హార్వర్డ్ స్కూల్ డ్రాపవుట్గా అందరికీ సుపరిచితమైన మార్క్ జుకర్ బర్గ్ ఎట్లకేలకు డిగ్రీ పట్టా అందుకోబోతున్నారు. మే నెలలో జరుగబోతున్న హార్వర్డ్స్ అప్ కమింగ్ గ్రాడ్యుయేషన్ సెర్మినీలో జుకర్ బర్గ్ ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు. ప్రారంభోత్సవ ప్రసంగానికి వస్తున్న మార్క్ జుకర్ బర్గ్ కు గౌరవ డిగ్రీ పట్టా అందించాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ఫేస్ బుక్ ను స్థాపించిన మార్క్ జుకర్ బర్గ్, డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న సమయంలోనే అంటే 2004లోనే హార్వర్డ్ స్కూల్ నుంచి బయటికి వచ్చేశారు.
తన పూర్తికాల సమయాన్ని ఫేస్ బుక్ పైనే వెచ్చించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఎక్కువగా ఫేమస్ అయిన ఫేస్ బుక్ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ యూజర్లున్నారు. ఇటీవల కాలంలో ప్రారంభోత్సవ ప్రసంగాన్ని ఇవ్వబోతున్న అతిపిన్న వయస్కుడిగా మార్క్ జుకర్ వర్క్ గుర్తింపులోకి రానున్నారని హార్వర్డ్ డైలీ స్టూడెంట్ న్యూస్ పేపర్ ది హార్వర్డ్ క్రిమ్సన్ నోట్స్ లో తెలిపింది. రెండు విధాలుగా హార్వర్డ్ డిగ్రీని సంపాదించుకునే అవకాశం ఆ స్కూల్ కల్పిస్తోంది. ఒకటి రెగ్యులర్ గా క్లాసెస్ కు వెళ్లి డిగ్రీ సంపాదించడం లేదా ప్రపంచ రూపురేఖలనే మార్చే కంపెనీని ఏర్పాటు చేయడం.