మైనర్లు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవచ్చా?
నేను నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఎన్‌పీఎస్‌లో అసెట్ అలకేషన్‌ను మార్చుకునే వీలు ఉందా ? ఉంటే ఏడాదిలో ఎన్ని సార్లు మార్చుకోవచ్చు?
- విజయ్, కరీంనగర్
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)లో అసెట్ అలకేషన్‌ను ఏడాది కొకసారి మార్చుకోవచ్చు. టైర్ వన్, టైర్ టు ఖాతాలకు ఇది వర్తిస్తుంది. ఎన్‌పీఎస్ ఖాతా కింది మీరు యాక్టివ్‌అనే ఆప్షన్‌ను ఎంచుకుంటేనే ఇలా మార్చుకునే వీలు ఉంటుంది. ఇక ఏడాదిలో ఒకసారి యాక్టివ్ లేదా ఆటో చారుుస్ ఆప్షన్‌లను మార్చుకునే వీలు కూడా ఉంది. గమనించాల్సిన విషయమేమిటంటే ఏడాదిలో ఒక్కదానిని మాత్రమే అంటే, అసెట్ అలకేషన్‌ను మార్చుకోవడం గానీ లేదా యాక్టివ్, ఆటో చాయిస్ ఆప్షన్‌లను మార్చుకోవడం కానీ చేయవచ్చు. ఒక్క ఏడాదిలో ఈ రెండింటిని మార్చుకునే వీలు లేదు.
ఎల్‌ఐసీ జీవన్‌లక్ష్య మంచి బీమా పాలసీయేనా ? దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యురిటీ తర్వాత మంచి రాబడులు వస్తాయని తెలిసిన ఎల్‌ఐసీ ఏజెంట్ అంటున్నాడు. దీంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా?
- సందీప్, విశాఖ పట్టణం
ఎల్‌ఐసీ జీవన్‌లక్ష్య అనేది ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కలిసివున్న సంప్రదాయబద్ధమైన ఎండోమెంట్ బీమా పాలసీ. బీమా అవసరాల కోసం ఇలాంటి ఎండోమెంట్ పాలసీలు అవసరం లేదని మేం భావిస్తాం. ఇన్వెస్ట్‌మెంట్‌కు, బీమాకు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేయాలి. ఈ రెండింటిని కలగలపకూడదు. బీమా కోసమైతే టర్మ్ ఇన్సూరెన్‌స పాలసీలు తీసుకోవడమే ఉత్తమం. వీటిల్లో ప్రీమియమ్‌లు తక్కువగానూ, బీమా కవర్ అధికంగానూ ఉంటాయి. మెచ్యూరైన తర్వాత భారీ మొత్తంలో సొమ్ము వస్తుందని చెప్పే పాలసీలు.. బీమా ముసుగులో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లని చెప్పవచ్చు. ఈ తరహా పాలసీల్లో వ్యయాలు అధికంగానూ, బీమా కవర్ తక్కువగానూ ఉంటారుు. ఈ తరహా పాలసీలు దీర్ఘకాలం పాటు లాక్-ఇన్‌అయి ఉన్నప్పటికీ, చెప్పుకోదగ్గ స్థారుు రిటర్న్‌లు మాత్రం ఇవ్వలేవు. మీకు ఎంత బీమా అవసరమో లెక్కేసి, దానికి సరిపడా మంచి, ప్రీమియమ్‌లు తక్కువగా ఉండే టర్మ్ ఇన్సూరెన్‌సపాలసీ తీసుకోండి. జీవన్‌లక్ష్య వంటి పాలసీలకు చెల్లించే ప్రీమియమ్‌తో పోల్చితే ఈ టర్మ్ ఇన్సూరెన్‌సపాలసీలకు చెల్లించే ప్రీమియమ్ తక్కువగా ఉంటుంది.
నా కొడుకు వయస్సు 12 సంవత్సరాలు. అతడి పేరు మీద మ్యూచువల్‌ఫండ్‌సలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అసలు మైనర్లు మ్యూచువల్ ఫండ్‌సలో ఇన్వెస్ట్ చేయవచ్చా?
- ఆనంద్, హైదరాబాద్
మైనర్లు(18 సంవత్సరాల వయస్సు లోపు వ్యక్తులు) మ్యూచువల్‌ఫండ్‌సలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్ సంరక్షకుడి ద్వారా మాత్రమే జరగాలి. తండ్రి లేదా చట్టబద్ద సంరక్షకుడు, మైనర్ తరపున మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లావాదేవీలు నిర్వహించవచ్చు. మైనర్‌కు సంబంధించి వయస్సు ధ్రువీకరణ పత్రాలు, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు నిర్వహించడానికి సంరక్షకుడి సంబంధిత పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఏడాది క్రితం ఒక క్లోజ్‌డ్ ఎండ్ మ్యూచువల్‌ఫండ్స్లో రూ. 3 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు అనుకోకుండా నా కూతురిని విదేశాల్లో చదివించే అవకాశం వచ్చింది. ఈ ఫండ్ యూనిట్లను విక్రయించి నాకు కావలసిన సొమ్ము నేను తీసుకోవచ్చా? - సుధాకర్, తిరుపతి
క్లోజ్‌డ్-ఎండ్ ఫండ్‌లో మెచ్యురిటీ కాలం ముగిసేదాకా మీరు మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రిడీమ్ చేసుకునే వీలు లేదు. అయితే క్లోజ్‌డ్-ఎండ్ మ్యూచువల్‌ఫండ్ యూనిట్లు సాధారణ షేర్ల మాదిరే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌అయి ట్రేడ్ అవుతాయి. కాబట్టి మీ యూనిట్లను విక్రయించుకోవచ్చు. అయితే ఈ ఫండ్‌సలో ట్రేడింగ్ లావాదేవీలు చాలా స్వల్పంగా జరుగుతాయి. ఒక వేళ కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినా, ఎన్‌ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) కంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తామని అంటారు. అంటే వాటి విలువ కంటే తక్కువకే మీరు వాటిని విక్రయించాల్సి వస్తుంది. ఇప్పుడు విదేశాల్లో చదువుల కోసం పలు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మీ పాప విదేశీ విద్య కోసం బ్యాంకులను సంప్రదించండి. తప్పనిసరైతేనే. మీ మ్యూచువల్ ఫండ్‌యూనిట్లను విక్రయించండి.
నేను మ్యూచువల్ ఫండ్‌సలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాలెన్‌సడ్ ఫండ్‌స మంచి రాబడులనిస్తాయని మిత్రులు చెబుతున్నారు. ఈ బ్యాలెన్‌సడ్ ఫండ్‌సలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేక పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయమంటారా? ఏ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి?
- జాన్సన్, గుంటూరు
దీర్ఘకాలం ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఈక్విటీ లేదా బ్యాలెన్‌సడ్ మ్యూచువల్ ఫండ్‌స ఎంచుకోవడం మంచి విషయం. పిల్లల ఉన్నత చదువు, సొంత ఇల్లు కొనుక్కోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు వంటి తదితర దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఈ తరహా మ్యూచువల్ ఫండ్‌సలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి తగిన రక్షణ పొందవచ్చు. ఒక వేళ మీ వద్ద పెద్ద మొత్తంలో సొమ్ములుంటే, ఆ మొత్తాన్ని ఏదైనా షార్ట్‌టర్మ్‌డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని సిస్టమాటిక్ ట్రాన్‌సఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా మీరు ఎంచుకున్న బ్యాలెన్‌సడ్ ఫండ్స్ లోకి బదిలీ చేయండి.