National Pension System
-
ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆర్ధిక అంశాలకు సంబంధించిన అనేక మార్పులు ఉండనున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు, పథకాలకు సంబంధించిన కొన్ని మార్పులు జరుగుతాయి, ఇవన్నీ వచ్చే నెల ప్రారంభం నుంచే అమలులోకి వస్తాయి. ఈ కథనంలో ఫిబ్రవరి 1నుంచి ఎలాంటి అంశాలలో మార్పులు రానున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఫాస్ట్‌ట్యాగ్ ఈ-కేవైసీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి దాదాపు 7 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేసినట్లు, ఇందులో కేవలం 4 కోట్లు మాత్రమే యాక్టివ్‌గా కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. అంతే కాకుండా 1.2 కోట్ల డూప్లికేట్ ఫాస్ట్‌ట్యాగ్‌లు వినియోగంలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల చివరి నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC పూర్తి కాకుంటే అలాంటి ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2023-24 సిరీస్ 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2024లో 2023-24 సిరీస్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ల(SGB) చివరి విడతను జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 4 ఫిబ్రవరి 12న ప్రారంభమై.. ఫిబ్రవరి 16న ముగుస్తుంది. గత సిరీస్ డిసెంబర్ 18న ప్రారంభమై.. డిసెంబర్ 22కు ముగిసింది. నేషనల్ పెన్షన్ సిస్టం నిధుల పాక్షిక ఉపసంహరణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) జనవరిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన మార్గదర్శకాలను హైలైట్ చేస్తూ ఒక మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. మొదటి ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం మాత్రమే చందాదారులు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చని పెన్షన్ బాడీ స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ రాయితీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తన కస్టమర్లకు గృహ రుణ రాయితీలను అందిస్తోంది. హోమ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీలకు చివరి తేదీ జనవరి 31, 2024. ఫ్లెక్సీపే, ఎన్ఆర్ఐ, నాన్ శాలరీడ్, ప్రివిలేజ్, అపాన్ ఘర్ కస్టమర్లకు రాయితీ అందుబాటులో ఉంది. సిబిల్ స్కోర్‌పై ఆధారపడి గృహ రుణాల వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు ధన్ లక్ష్మి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) 'ధన్ లక్ష్మి 444 డేస్' పేరుతో తీసుకు వచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకానికి చివరి తేదీ జనవరి 31, 2024. ఈ స్కీమ్ లాస్ట్ డేట్ 2023 నవంబర్ 30 అయినప్పటికీ.. ఆ సమయంలో గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు సాధారణ పౌరులైతే 7.4 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.9%, సూపర్ సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది. -
ఎన్పీఎస్ ఉపసంహరణకు ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణ
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి చందాదారులు తమ నిధులను ఉపసంహరించుకునే సమయంలో ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణను పింఛను నిధి అభివృద్ధి, నియంత్రణ మండలి (పీఎఫ్ఆర్డీఏ) ప్రవేశపెట్టింది. పెన్నీడ్రాప్ విధానంలో చందాదారు బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, ఎన్పీఎస్లోని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్లోని పేరు ఏక రూపంలో ఉందా అన్నది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) తనిఖీ చేస్తుంది. ఎన్‌పీఎస్‌తోపాటు ఎన్పీఎస్ లైట్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు సంబంధించి అన్ని రకాల ఉపసంహరణలు, వైదొలగడాలు, చందాదారు బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులకు నూతన విధానం అమలు కానుంది. దీన్ని ఎలా చేస్తారంటే.. చందాదారు బ్యాంక్ ఖాతాలోకి చాలా స్వల్ప మొత్తాన్ని (రూపాయి) బదిలీ చేస్తారు. తద్వారా బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరును ధ్రువీకరించుకుంటారు. నిధుల ఉపసంహరణకే కాకుండా, చందాదారులు తమ బ్యాంక్ ఖాతా వివరాల అప్డేట్కు దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. ఈ పెన్నీడ్రాప్ విధానంలో ధ్రువీకరణ విజయవంతం కాకపోతే, నోడల్ ఆఫీస్ సహకారాన్ని సీఆర్ఏ తీసుకుంటుంది. పెన్నీడ్రాప్ విఫలమైందని, సమీప నోడల్ ఆఫీస్ లేదా పీవోపీని సంప్రందించాలంటూ చందాదారులకు ఈ మెయిల్, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. చందాదారు నుంచి సరైన వివరాలు అందేంత వరకు నిధుల బదిలీని నిలిపివేస్తారు. -
అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎన్పీఎస్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్)ను అన్ని బ్యాంక్ శాఖలు, తపాలా కార్యాలయాల్లో (పోస్టాఫీసులు) అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. ప్రజలకు సులభంగా ఎన్పీఎస్ను అందుబాటులో ఉంచేందుకు, ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఎన్పీఎస్ పథకం పంపిణీ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లతో పీఎఫ్ఆర్డీఏ జట్టు కడుతోంది. దీంతో పల్లెలు, చిన్న పట్టణాల్లోని ప్రజలు సైతం ఈ పథకం ప్రయోజనాలను సులభంగా పొందడానికి వీలుంటుంది’’అని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ తెలిపారు. ప్రైవేటు రంగం నుంచి కార్పొరేట్, వ్యక్తిగత స్థాయిలో 13 లక్షల మందిని ఎన్పీఎస్ చందాదారులుగా చేర్చుకునే లక్ష్యంతో ఉన్నట్టు మహంతి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మందిని చేర్చుకున్నట్టు పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023 సెపె్టంబర్ 16 నాటికి ఎన్పీఎస్ చందారులు 1.36 కోట్లుగా ఉన్నారు. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులు 5 కోట్లుగా ఉన్నారు. ఎన్పీఎస్ కింద స్థిర పింఛను ఎందుకు నిర్ణయించలేదన్న ప్రశ్నకు మహంతి బదులిచ్చారు. ‘‘దీర్ఘకాలానికి పింఛను నిర్ణయించడం సాధ్యపడదు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, జీడీపీతో సమానంగా లేదంటే అంతకుమించి పింఛను నిధి ఉన్నా కానీ, ఈ విషయంలో సమస్య నెలకొంది’’అని వివరించారు. అయితే, ఎన్పీఎస్ నుంచి రాబడులు మెరుగ్గా ఉంటాయని చెబుతూ.. దీర్ఘకాలంలో మంచి నిధిని ఆశించొచ్చన్నారు. ఎన్పీఎస్ విక్రయంపై వచ్చే కమీషన్ చాలా తక్కువని, అందుకే ఏజెంట్లు దీని పట్ల ఆసక్తి చూపించడం లేదన్నారు. కానీ, ఎన్పీఎస్ను తక్కువ వ్యయంతో కూడిన ఉత్పత్తిగానే కొనసాగించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన పథకం నిర్వహణ ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంటాయన్నారు. -
ఎన్పీఎస్ నుంచి నెలవారీ ఆదాయం
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద క్రమం తప్పకుండా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తీసుకురానున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. దీంతో 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ ఖాతాదారులు అప్పటి వరకు సమకూరిన నిధి నుంచి కావాల్సినంతే ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఈ ప్రతిపాదన పురోగతి దశలో ఉంది. దాదాపు వచ్చే త్రైమాసికం చివరి నాటికి ఈ పథకంతో ముందుకు వస్తాం’’అని మహంతి చెప్పారు. ప్రస్తుతం ఎన్పీఎస్ పథకంలో 60 ఏళ్లు నిండిన వారు అప్పటి వరకు సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకుని, మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది. అంతేకానీ, నెలవారీ ఇంత చొప్పున తీసుకునే అవకాశం లేదు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ను అమల్లోకి తీసుకొస్తే అప్పుడు పింఛనుదారులు నెలవారీ లేదా మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికొకసారి.. వీటిల్లో తమకు అనువైన ఆప్షన్ ఎంపిక చేసుకుని, క్రమం తప్పకుండా ఆదాయం పొందొచ్చు. ఇలా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకోవడానికి పీఎఫ్ఆర్డీఏ అవకాశం కల్పించనుంది. ‘‘నా నిధిపై మంచి రాబడులు వస్తున్నప్పుడు ఆ మొత్తాన్ని ఎందుకు కొనసాగించకూడదు. ఎందుకు యాన్యుటీ తీసుకోవాలనే అభ్యర్థనలు వస్తున్నాయి’’అని మహంతి తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, యాన్యుటీని వాయిదా వేసుకోవచ్చని, దీనివల్ల తర్వాత అధిక మొత్తంలో పింఛను వస్తుందని చెప్పారు. తాము తీసుకురాబోయే మార్పుతో, చందాదారులు 40 శాతం నిధితో డిఫర్డ్ యాన్యుటీని ఎంపిక చేసుకుని, మిగిలిన 60 శాతం ఫండ్‌ను క్రమం తప్పకుండా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. -
ఎన్పీఎస్, ఏపీవై పథకాలకు ఆదరణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. చందాదారులు పెద్ద ఎత్తున ఈ పథకాల్లో చేరుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో (2022 మార్చి 5 నుంచి 2023 మార్చి 4 నాటికి) ఈ రెండు పథకాల కింద చందాదారుల సంఖ్య 23 శాతం పెరిగి 6.24 కోట్లుగా ఉంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. విడిగా చూస్తే ఏపీవై చందాదారుల్లో 28 శాతం వృద్ధి ఉంది. గతేడాది మార్చి 4 నాటికి ఈ రెండు పథకాల కింద చందారుల సంఖ్య 5.20 కోట్లుగా ఉంది. ఎన్పీఎస్ చందాదారుల్లో 23.86 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కాగా, 60.72 లక్షల మంది రాష్ట్రాల ఉద్యోగులు కావడం గమనార్హం. కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య 16.63 లక్షలుగా ఉంది. ఏపీవై చందాదారులు 4.53 కోట్లుగా ఉన్నారు. 2015 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. ఎలాంటి సామాజిక భద్రత లేని కార్మికులకు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, వృద్ధాప్యంలో పింఛను సదుపాయం కోసం దీన్ని ప్రారంభించింది. సభ్యులు నెలవారీ చెల్లించిన చందానుబట్టి 60 ఏళ్లు వచ్చిన తర్వాత నుంచి ప్రతి నెలా రూ.1,000–5,000 మధ్య పింఛను లభిస్తుంది. 2022 అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఈ పథకంలో చేరుకుండా కేంద్రం నిషేధించింది. -
కేంద్రం పెన్షన్ పథకం రూల్స్ మారాయ్.. వివరాలు తెలుసుకోండి
రీటైర్మెంట్ తర్వాత జీవితం సాఫిగా సాగేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్పీఎస్)పేరిట పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా పెన్షన్ నిధి నియంత్రణ సంస్థ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీఏ) కొన్ని నిబంధనల్ని సడలించింది. మారిన సడలింపులు లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సడలించిన నిబంధనలు ►పీఎఫ్ ఆర్డీఏ సడలించిన నిబంధనల ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద సూచించిన పరిమితి వరకు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. ►ఎన్పీఎస్ అకౌంట్లో జమచేసే సొమ్ము మొత్తంలో రిటైర్మెంట్కు ముందు 25 శాతం దాకా తీసుకోవచ్చు ►రిటైర్మెంట్ తర్వాత ఎన్‌పీఎస్‌లో జమయ్యే నిధిలో 60 శాతం మేరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మరో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు వెచ్చించాలి. ►గడువుకు ముందే ఎవరైనా ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచింది. ►ఎన్‌పీఎస్‌లో చేరే వయసు ఇప్పటివరకూ 65 ఏళ్లు ఉండగా.. దీన్ని 70 ఏళ్లకు పెంచారు. ►ఎవరైనా 65 సంవత్సరాల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరితే, కనీసం 3ఏళ్ల పాటు కొనసాగాలి. ►ఒకవేళ 65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరి..3 సంవత్సరాల ముందే విత్‌డ్రా చేయాలనుకుంటే..జమ చేసిన మొత్తంలో 20% వరకు మాత్రమే పన్నురహిత ఉపసంహరణను అనుమతిస్తారు. మిగతా మొత్తం జీవితకాలం పెన్షన్‌గా ఉంటుంది. రూ.5 లక్షల నిధి మాత్రమే ఉంటే.. మొత్తం వెనక్కి.. గతంలో ఎన్పీఎస్ నుంచి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే సదుపాయం లేదు. ఉదాహరణకు పథకంలో జమ చేసిన మొత్తం రూ.2లక్షలు దాటితే.. పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40శాతంతో ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వీలుండేది. కానీ తాజాగా సడలించిన నిబంధనలతో రూ.5 లక్షల లోపు ఎన్పీఎస్ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసినా..ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. -
అందరికీ ‘ఎన్పీఎస్’ పన్ను ప్రయోజనం
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకం కింద 14 శాతం చందాకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లభిస్తున్న పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని మరింత విస్తరింపజేయాలని కేంద్రానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్– పీఎఫ్ఆర్డీఏ విజ్ఞప్తి చేయనుంది. 2021–22 బడ్జెట్లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చైర్మన్ సుప్రీతిమ్ బందోపాధ్యాయ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్పీఎస్ పథకం కింద 14 శాతం యాజమాన్యాల చందాకు 2019 ఏప్రిల్ 1 నుండి పన్ను మినహాయింపును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలకు ఇస్తున్న ఈ మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వ, ఇతర కార్పొరేట్ సంస్థలకూ వర్తింపజేయాలని కోరుతున్నట్లు బందోపాధ్యాయ వెల్లడించారు. చందాదారులందరికీ ఈ ప్రయోజనం అందాలన్నది తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఇప్పటికే కేంద్ర సంస్థల యాజమాన్యాలకు అందుతున్న ప్రయోజనాలను తమకూ వర్తింపజేయాలని కోరుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ)కి లేఖలు రాసినట్లు ఆయన వివరించారు. యథాపూర్వం 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూలతలు, ఉద్దీపన చర్యలు, ఆదాయాలు–వ్యయాలకు మధ్య భారీగా పెరిగిపోనున్న ద్రవ్యలోటు, మౌలిక రంగంపై భారీ నిధుల కేటాయింపులకు భారీ అవరోధాలు వంటి అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు తాజా బడ్జెట్ కత్తిమీద సాములాగా కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్. టైర్–2 ఎన్పీఎస్ అకౌంట్లను కూడా... దీనితోపాటు చందాదారులందరి టైర్–2 ఎన్పీఎస్ అకౌంట్లను కూడా పన్ను మినహాయింపు పరిధిలోనికి తీసుకురావాలని కోరుతున్నట్లు బందోపాధ్యాయ తెలిపారు. ‘‘ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనాన్ని అందించడం జరిగింది. ట్యాక్స్ ఫ్రీ టైర్ 2 అకౌంట్లను మూడేళ్లు లాక్ ఇన్ పీరియడ్‌లో ఉంచడం జరుగుతుంది. పన్ను రహిత హోదానే దీనికి కారణం. ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు. ఎన్పీఎస్ కింద టైర్–2 అకౌంట్ తప్పనిసరి అకౌంట్ కాదు. దీనిని టైల్–1 అకౌంట్‌తో పాటు ఎంపికచేసుకోవచ్చు. తక్షణం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ఎన్పీఎస్ అంటే... ఇది ఒక స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. పీఎఫ్ఆర్డీఏ నిర్వహిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ఈ పథక రూపకల్పన జరిగింది. ఎన్‌పీఎస్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటి టైర్–1, రెండు టైర్–2. టైర్–1 శాశ్వత రిటైర్మెంట్ అకౌంట్. ఇందులో డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్లు క్రమంగా వృద్ధి చెందుతూ, చివరికి నిర్దిష్ట మొత్తంలో లేదా పెన్షన్ రూపంలో వడ్డీతో సహా చందాదారునికి అందుతుంది. ఇక టైర్–2 స్వచ్ఛంద విత్‌డ్రాయెల్ అకౌంట్. టైర్–1 అకౌంట్ ఉన్న వారే దీనిని నిర్వహించడానికి అర్హులు. అతల్ పెన్షన్ యోజన (ఏపీవై) పేరుతో మరో పెన్షన్ స్కీమ్‌ను పీఎఫ్ఆర్డీఏ నిర్వహిస్తోంది. ఎన్పీఎస్ ప్రధానంగా వ్యవస్థాగత ఉద్యోగుల విభాగాన్ని ఉద్దేశించినదైతే, ఏపీవై అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి ఉపయోగపడుతుంది. -
ఠీవీగా రిటైర్మెంట్..!
వేతన జీవులు అందరూ తాము రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నిశ్చింతగా జీవించేందుకు ముందుగానే ప్రణాళికా బద్ధంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇటీవలి సంవత్సరాల్లో అవగాహన విస్తృతం అవుతోంది. విశ్రాంత జీవితానికి క్రమం తప్పని పెట్టుబడులు ఎంతో కీలకం. ఇందుకోసం బాగా ప్రాచుర్యంలో ఉన్న సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్, యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఈపీఎఫ్, పీపీఎఫ్, వీపీఎఫ్ ఉన్నాయి. వీటిలోని లాభ, నష్టాలు తెలుసుకున్న తర్వాత తమ రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా భిన్న సాధనాల మధ్య ఎంత పెట్టుబడుల కేటాయించాల్సిన మొత్తాలపై ప్రణాళిక వేసుకోవాలి. ఆ తర్వాత క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడంతోపాటు, నిర్ణీత కాలానికి ఆ పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఇందుకు సంబంధించిన పెట్టుబడి సాధనాల వివరాలను తెలియజేసే కథనమే ఇది. మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ పథకాలు రిటైర్మెంట్ జీవనానికి నిధి సమకూర్చుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలు సరైన ఎంపిక అవుతుంది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, మల్టీక్యాప్, స్మాల్‌క్యాప్, ఈఎల్ఎస్ఎస్ ఇలా ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో మార్కెట్లలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ ఈ విభాగాల్లోని పథకాలు వార్షికంగా 16–21 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇదే కాలంలో సెన్సెక్స్ టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఇండెక్స్) రాబడులు 17.8 శాతంగా ఉన్నాయి. 25 ఏళ్ల కాలంలో చూసుకుంటే సెన్సెక్స్ వార్షిక రాబడులు 11 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో టాప్ లార్జ్‌క్యాప్ ఫండ్స్ వార్షికంగా 19 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చాయి. కాకపోతే సెబీ ఇటీవలి కాలంలో పథకాల పునర్వ్యస్థీకరణకు చేసిన మార్పులు, గత ఏడాది కాలంలో మార్కెట్ల పనితీరు నత్తనడకనే ఉండడం వంటి అంశాలతో లార్జ్‌క్యాప్ పథకాల పనితీరు బెంచ్‌మార్క్‌కు అనుగుణంగా లేదు. కనుక మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో యాక్టివ్ పథకాలు దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపించగలవు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం, నిర్ణీత కాలానికోసారి పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్ చేసుకోవడం, పనితీరు ఆశించిన మేర లేని పథకాల నుంచి వైదొలగి, వాటి స్థానంలో వేరే వాటిని ఎంచుకోవడం చేస్తుండాలి. నిర్ణీత లక్ష్యానికి సమయం దగ్గర పడుతుంటే ఈక్విటీల నుంచి వైదొలిగి సురక్షిత సాధనాల్లోకి పెట్టుబడులు మళ్లించుకోవాలి. ఇందుకోసం అధిక నాణ్యత కలిగిన డెట్ ఫండ్స్, బ్యాంకు ఎఫ్డీలు పనికొస్తాయి. సాధారణ ఈక్విటీ పథకాలకు అదనంగా ప్రత్యేకించి రిటైర్మెంట్ అవసరాల కోసం రిటైర్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఈ విభాగంలోనివే. వీటిల్లో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. ఇక టాటా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఆది త్య బిర్లా సన్‌లైఫ్ కూడా పథకాలను ప్రవేశపెట్టాయి. ఇందులో టాటా రిటైర్మెంట్ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ప్రొగ్రెసివ్, మోడరేట్ పేరుతో నడిచే రెండు ఈక్విటీ పథకాల్లోనూ ఐదేళ్ల కాలంలో రాబడులు 18 శాతం స్థాయిలో ఉన్నాయి. బెంచ్‌మార్క్ కంటే ఈ పథకం ఎక్కవే రాబడులు తెచ్చిపెట్టింది. యూటీఐ రిటైర్మెంట్, ఫ్రాంక్లిన్ పెన్షన్ అన్నవి డెట్‌తో కూడిన బ్యాలన్స్డ్ ఫండ్స్. డెట్‌కు, ఈక్విటీలకు 40:60 నిష్పత్తిలో పెట్టుబడులను కేటాయిస్తాయి. ఈ రెండు పథకాలు గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10–11 శాతం రాబడులను ఇచ్చాయి. ఈ పథకాలన్నీ కూడా నెలవారీగా తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో వివరాలను ఇన్వెస్టర్లకు వెల్లడిస్తుంటాయి. ఇండెక్స్ ఫండ్స్ 1–1.5 శాతం స్థాయిలో చార్జ్ చేస్తుంటే, ఈటీఎఫ్‌ల్లో ఎక్స్పెన్స్ రేషియో 0.5 శాతంగా ఉంటోంది. యాక్టివ్‌గా నడిచే ఈక్విటీ ఫండ్స్ మాత్రం 1.6–2.7 శాతం మధ్య చార్జీలను రాబడుతున్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో 2.3–2.8 శాతం మధ్య ఉంది. ఇక డైరెక్ట్ ప్లాన్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే అర శాతం వరకు ఎక్స్పెన్స్ రేషియో భారం తగ్గుతుంది. పన్ను వివరాలు ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్లు రెండింటిలోనూ పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ ఫండ్స్‌లో తొలుత పెట్టుబడి చేసేటప్పుడు మినహాయింపు లభిస్తుంది కానీ...వాటిపై వచ్చే రాబడులపై పన్ను వుంటుంది. ఈ రెండూ డెట్‌తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్. మూడేళ్లకు మించి పెట్టుబడులు కొనసాగిస్తే రాబడులపై 20 శాతం పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ రాబడులకు ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం మినహాయింపు) ప్రయోజనం ఉంటుంది. మూడేళ్లలోపు వైదొలిగితే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించుకోవాలి. అదే ఈక్విటీ పథకాలు అయితే ఏడాది దాటిన తర్వాత రాబడులపై 10 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను పడుతుంది. రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా ప్రతీ నెలా తమ అవసరాలకు సరిపడా వెనక్కి తీసుకోవచ్చు. దీంతో పన్ను భారం అంతగా ఉండదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) విశ్రాంత జీవనానికి అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల్లో అత్యంత ముఖ్యమైనది ఎన్పీఎస్. ఈక్విటీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్ల సమతూకంతో పలు రకాల పెట్టుబడి ఆప్షన్లు ఎన్‌పీఎస్‌లో ఉన్నాయి. ఎనిమిది ఫండ్ మేనేజర్లలో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు. వీటిల్లో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, యూటీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్ మెరుగ్గా ఉన్నాయి. బిర్లా సన్‌లైఫ్ మినహా మిగిలిన ఫండ్ సంస్థలు ఎన్‌పీఎస్‌లు ఏ మేరకు రాబడులను ఇచ్చాయన్నదానిపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు అందుబాటులో ఉంది. ఆ వివరాలను పరిశీలించి అనువైన దానిని ఎంచుకోవచ్చు. వార్షికంగా కనీసం రూ.1,000ను ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతాన్నే యాక్టివ్ చాయిస్ కింద ఎంచుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని తప్పనిసరిగా కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు కేటాయించుకోవాల్సి ఉంటుంది. 50 ఏళ్ల వయసు దాటితే యాక్టివ్ చాయిస్ చందాదారులు ఈక్విటీలకు కేటాయింపులను క్రమంగా 50 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే ఆటో చాయిస్లో అయితే ఎన్పీఎస్ చందాదారుని వయసు ఆధారంగా ఈక్విటీలకు పెట్టుబడుల రేషియో మారుతూ ఉంటుంది. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి అయితే, 100 సంవత్సరాల కాలంలో 40 ఏళ్లను తీసివేయగా, మిగులు 60 శాతం ఉంటుంది కనుక ఈ విధానం ప్రాతిపదికన ఆటో చాయిస్లో ఈక్విటీలకు 60 శాతం డెట్సాధనాలకు 40 శాతం ఫండ్ మేనేజర్లే కేటాయింపులు చేస్తారు. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్, సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ 100 స్టాక్స్‌లోనే ఫండ్స్ సంస్థలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈక్విటీతో కూడిన పెట్టుబడి ఆప్షన్ కింద ఫండ్స్ మేనేజింగ్ సంస్థలు వార్షికంగా 11–13 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇందులో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్, యూటీఐ 12 శాతానికి పైబడి రాబడులను ఇచ్చాయి. గిల్ట్ విభాగంలో పెట్టుబడులపై ఇవి గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10–11 శాతం మేర రాబడులు తెచ్చి పెట్టాయి. కార్పొరేట్ బాండ్స్ విభాగంలో రాబడులు 9–10 శాతం మధ్య ఉన్నాయి. పాక్షిక ఉపసంహరణలకు అనుమతి కొన్ని రకాల అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే, పిల్లల విద్యావసరాలు, ఇంటి కొనుగోలు సమయాల్లో పాక్షిక ఉపసంహరణలకు ఎన్పీఎస్ పథకంలో అనుమతి ఉంది. ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు నెలవారీగా, కొన్ని సందర్భాల్లో అర్ధ సంవత్సరానికోసారి పోర్ట్‌ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఎన్పీఎస్ను ప్రారంభించుకోవచ్చు. ఖాతా ప్రారంభ చార్జీ కింద రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక నిర్వహణ ఫీజు కింద ఎన్ఎస్డీఎల్కు రూ. 95 చెల్లించాలి. వీటికి అదనంగా ప్రతీ లావాదేవీపై రూ.3.75 చార్జీ ఉంటుంది. కార్వీ సంస్థ తక్కువ చార్జీలను వసూలు చేస్తోంది. ఇంకా పాయింట్ ఆప్ ప్రెజెన్స్ (డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లించేది) చార్జీ పేరుతో ప్రారంభంలో రూ.200 చార్జీ చెల్లించుకోవాలి. అంతేకాదు, ఇక ఆ తర్వాత చేసే అన్ని పెట్టుబడులపై 0.25 శాతం కమీషన్ కూడా డిస్ట్రిబ్యూటర్‌కు వెళుతుంది. ఈఎన్పీఎస్ ద్వారా పెట్టుబడి పెడితే అప్పుడు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్‌కు కేవలం 0.1 శాతమే కమీషన్ వెళుతుంది. కనుక ఆన్లైన్లో నేరుగా ఎన్పీఎస్ సైట్ ద్వారా చందాలు చేసుకోవడం ద్వారా ఆదా చేసుకోవచ్చు. అలాగే, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీజు కూడా వార్షికంగా 0.01 శాతమే పడుతుంది. ఆదాయపన్ను ప్రయోజనాలు ఎన్పీఎస్కు అదనంగా ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడుల తర్వాత కూడా మరో రూ.50,000 మొత్తంపై పన్ను మినహాయింపును సెక్షన్ 80సీసీడీ కింద ఎన్‌పీఎస్‌లో పెట్టుబడుల ద్వారా పొందే అవకాశం ఉంది. ఎన్‌పీఎస్‌లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేసినా మొత్తం సెక్షన్ 80సీ, సీసీడీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్ల తర్వాత మొత్తం నిధిలో 60 శాతాన్ని పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలి. యూనిట్లింక్డ్ ప్లాన్లు ఈక్విటీ ఆధారిత పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటిని బీమా సంస్థలు ఆఫర్ చేస్తుంటాయి. బజాజ్ అలియాంజ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ లైఫ్ పెన్షన్లను ప్లాన్లను అందిస్తున్నాయి. బీమా సంస్థలు తాము నిర్వహించే ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. రాబడులకు హామీ ఉండదు. మార్కెట్ పనితీరు ఆధారంగానే ఉంటాయి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు ఎంచుకున్న పథకాలను బట్టి 6.5–14.1 శాతం మధ్య ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 7.3–12.6 శాతంగా ఉన్నాయి. ఎటువంటి చార్జీలను మినహాయించకముందు రాబడుల వివరాలు ఇవి. రాబడులు ఆశించిన విధంగా లేకపోతే భిన్న ఆప్షన్ల మధ్య పెట్టుబడులను మార్చుకునే అవకాశాన్ని బీమా సంస్థలు ఈ పథకాల్లో అనుమతిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత సమకూరిన నిధిలో మూడింట రెండొతులను పెన్షన్ యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఒక వంతును వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్లు ప్రతీ నెలా పోర్ట్‌ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. కాకపోతే ఈ పాలసీల్లో బీమా కూడా ఉంటుంది కనుక అదనపు చార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. యూనిట్ లింక్డ్ప్లాన్ ఎందులో అయినా పెట్టుబడులు, బీమా కలగలసి ఉంటాయి. దీంతో మోర్టాలిటీ చార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, ప్రీమియం అలోకేషన్ చార్జీలు ఇలా రకరకాల రూపంలో చార్జీల భారం ఉంటుంది. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ 1–1.35 శాతం వరకు ఉంటుంది. పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ 0.3–0.4గా ఉంటుంది. వార్షిక ప్రీమియానికి బీమా మొత్తం కనీసం 10 రెట్లు ఉంటే, పన్ను మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 80సీ కింద ప్రీమియానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే, ఉపసంహరణ సమయంలో ఒక వంతుకు పన్ను ఉండదు. మిగిలిన రెండొంతులను యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అందుబాటులో ఉన్న సురక్షిత పెట్టుబడి సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో పెట్టుబడులకు హామీ ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 8 శాతం. ప్రతీ త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్రం సవరిస్తుంటుంది. దీనికి అదనంగా పన్ను మినహాయింపులు (పెట్టుబడులపై, రాబడులు, ఉపసంహరణలపైనా) ఉన్నందున ఇది ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన సాధనం. ఇది డెట్ సాధనం. వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత కావాలంటే వ్యవధిని ఐదేళ్లు పెంచుకోవచ్చు. కనుక దీర్ఘకాలిక అవసరాల కోసం తగిన ఎంపిక అవుతుంది. ఏడాదిలో కనీసం 500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడులకే పన్ను మినహాయింపు లభిస్తుంది. మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాల వ్యవధి అమల్లోకి వస్తుంది. ఉదాహరణకు 2018 అక్టోబర్‌లో మొదటి వాయిదా కట్టారనుకోండి. అప్పుడు 2019 ఏప్రిల్ 1 నుంచి 2034 ఏప్రిల్1 వరకు కాల వ్యవధి అమలవుతుంది. మూడు నుంచి ఆరో ఏట వరకు రుణం తీసుకోవచ్చు. రుణం తీసుకోవడానికి రెండేళ్ల ముందు నాటికి ఉన్న బ్యాలన్స్‌లో 25 శాతాన్ని రుణంగా ఇస్తారు. తిరిగి మూడేళ్ల కాలంలో రుణాన్ని తీర్చివేయాలి. ఏడో ఏట నుంచి పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. పీపీఎఫ్‌లో పెట్టుబడులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. అలాగే, పెట్టుబడులపై వడ్డీ, చివర్లో ఉపసంహరణల మొత్తం మీదా పన్ను ఉండదు. దీంతో 30% పన్ను పరిధిలో ఉన్న వారికి వాస్తవంగా గిట్టుబాటయ్యే వడ్డీ 11.9 శాతంగా అంచనా వేసుకోవచ్చు. అధిక పన్ను శ్లాబుల్లోని వారికి పీపీఎఫ్ ఎంతో ఆకర్షణీయమైన సాధనం అవుతుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అన్ని రకాల డెట్ సాధనాల్లో అధిక రాబడులను ఇస్తున్న సాధనం ఇది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ కంటే ఎక్కువగానే ఈపీఎఫ్ చందాలపై వడ్డీ రేటును నిర్ణయించడం జరుగుతోంది. ఇందులో పెట్టుబడులు, రాబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఇటీవలే 2018–19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యోగి వేతనం (బేసిక్, డీఏ కలిపిన మొత్తం)లో 12 శాతాన్ని మినహాయించి ఈపీఎఫ్, ఈపీఎస్‌కు జమ చేయడం జరుగుతుంది. అలాగే, ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా చెల్లిస్తుంది. పనిచేసే సంస్థను మారిపోయి, మరో ఉద్యోగంలో చేరినా ఈపీఎఫ్‌ను కొనసాగించుకోవచ్చు. దీనికి అదనంగా ఉద్యోగి తన బేసిక్, డీఏ మొత్తంలో 100 శాతాన్ని వీపీఎఫ్ (వాలెంటరీ ప్రావిడెంట్ ఫండ్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఈపీఎఫ్ వడ్డీ రేటే అమలవుతుంది. పన్ను ప్రయోజనాలు ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు సమానంగా వర్తిస్తాయి. పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందొచ్చు. రాబడులు, ఉపసంహరణలకూ పన్ను లేదు. -
ఎన్‌పీఎస్‌లో.. పెడుతున్నారా..?
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో (ఎన్పీఎస్) పెట్టుబడుల తీరుతెన్నులను మార్చాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) యోచిస్తోంది. ఇందులో భాగంగా... ప్రస్తుతం 50 శాతానికే పరిమితమైన ఈక్విటీలకు కేటాయించే మొత్తాన్ని ఇకపై 75 శాతం దాకా పెంచేలా ప్రతిపాదిస్తోంది. దీనిపై అభిప్రాయాలు సేకరిస్తోంది. ఎందుకిలా? ఒకవేళ ఇలా చేస్తే చందాదారులకు కలిగే లాభనష్టాలేంటి? ఒకసారి చూద్దాం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో నాలుగు రకాల ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. అవి.. 1. ప్రభుత్వ సెక్యూరిటీస్ ఫండ్ లేదా స్కీమ్ జీ 2. కార్పొరేట్ బాండ్స్ ఫండ్ లేదా స్కీమ్ సి 3. ఈక్విటీస్ ఫండ్ లేదా స్కీమ్ ఈ 4. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లేదా స్కీమ్ ఎ. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది... లైఫ్ సైకిల్ ఆధారిత విధానం. ఇందులో మీ వయసు ఆధారంగా పెట్టుబడులు పెట్టేలా ముందే నిర్ణయించిన లైఫ్ సైకిల్ ఫండ్ ప్లాన్ ఉంటుంది. దీని ప్రకారం 35 ఏళ్లు వచ్చే దాకా ఈక్విటీలకు గరిష్టంగా 50% కేటాయించవచ్చు. 55 ఏళ్లు వచ్చేసరికి ఇది 10 శాతానికి తగ్గిపోతుంది. అయితే 2016లో కొత్తగా మరో రెండు లైఫ్ సైకిల్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఒక దాని తీరు దూకుడుగా ఉండేది కాగా.. ఇంకొకటి కాస్త సంప్రదాయబద్ధంగా ఉండేది. దూకుడుగా ఉండే అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ విధానంలో 35 ఏళ్లు వచ్చే దాకా గరిష్టంగా 75% మేర ఈక్విటీలకు కేటాయించవచ్చు. అదే సాంప్రదాయబద్ధంగా ఉండే కన్జర్వేటివ్ ఆప్షన్లో ఇది 25 శాతమే. 55 ఏళ్లు వచ్చేసరికి ఈక్విటీలకు కేటాయింపులు అగ్రెసివ్ ఫండ్ విధానంలోనైతే 15 శాతానికి, కన్జర్వేటివ్ విధానంలోనైతే 5 శాతానికి తగ్గిపోతాయి. ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ విధానంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ జోలికి వెళ్లవు. ఇక, రెండవది యాక్టివ్ విధానం. ఇందులో ఏ దశలో కూడా ఈక్విటీలకు కేటాయింపులు 50 శాతానికి మించవు. అయితే, అంతర్గత పరిమితులకు లోబడి ఇన్వెస్టర్లు.. నాలుగింట్లో ఏ స్కీములోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. నిర్దిష్ట పరిమితి దాకా కేటాయింపులు చేయొచ్చు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మాత్రం పరిమితి 5 శాతమే. ఈ యాక్టివ్ విధానంలోనే ఈక్విటీల్లో ఇప్పటిదాకా 50 శాతంగా ఉన్న పెట్టుబడుల పరిమితిని 75% దాకా పెంచాలని పీఎఫ్ఆర్డీఏ యోచిస్తోంది. అయితే, దీన్లోనూ ఓ మెలిక ఉంది. అది... 50 ఏళ్లు వచ్చే దాకా మాత్రమే ఈక్విటీలకు 75%దాకా కేటాయించవచ్చు. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గించుకోవాలి. రిటైర్మెంట్ నాటికి దీన్ని 50 శాతానికి తగ్గించుకోవాలి. ఇలా కేటాయింపులు తగ్గించుకుంటూ రాగా మిగిలిన మొత్తాన్ని ఇతర ఫండ్స్‌కి మళ్లించవచ్చు. ఎన్పీఎస్ ప్రయోజనాలు.. ఎన్‌పీఎస్‌లో ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు అత్యంత తక్కువగా 0.01%మేర ఉంటున్నాయి. ఇది కొంత మేర పెరిగినా రాబడులు అధికంగా ఇచ్చే అవకాశాలున్నందున అంతిమంగా ఇన్వెస్టర్లకు లాభమేనన్నది పరిశ్రమ వర్గాల మాట. పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించడం ఎన్‌పీఎస్‌లో రెండో ఆకర్షణీయ అంశం. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (1బి) కింద అదనంగా రూ.50,000 మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సి కింద లభిస్తున్న రూ.1.5 లక్షల డిడక్షన్‌కి ఇది అదనం. ప్రతికూలాంశాలూ ఉన్నాయ్... మెచ్యూరిటీ తరవాత వచ్చే మొత్తంలో కనీసం 40 శాతాన్ని కచ్చితంగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన ఇబ్బందికరమే. సాధారణంగా యాన్యుటీ పథకాలపై వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే.. భవిష్యత్‌లో మళ్లీ కావాలనుకుంటే ఎకాయెకిన వెనక్కి తీసుకోలేకుండా కొంత మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో లాక్ చేసేస్తున్నట్లే లెక్క. అలా కాకుండా రిటైర్మెంట్ అవసరాలకు తగిన ఆదాయాన్ని అందించేలా డెట్, ఈక్విటీ మేళవింపుతో.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) గల మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయన్నది వారి సూచన. మరోవైపు, 50 ఏళ్ల నుంచి ఈక్విటీలకు కేటాయింపులు తగ్గించుకుంటూ రావాలన్న నిబంధనను వ్యతిరేకించే వారూ ఉన్నారు. యాభై ఏళ్లు పైబడినా దూకుడుగా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే సామర్ధ్యం ఉండే ఇన్వెస్టర్లు కూడా ఉంటారు కాబట్టి.. ఆ ఆప్షన్ వారికే వదిలేయడం మంచిదని సదరు ఫైనాన్షియల్ ప్లానర్స్ అభిప్రాయం. ఏదైతేనేం.. ఈక్విటీలకు కేటాయింపులు పెంచే వీలు కల్పించే ప్రతిపాదన మంచిదే అయినప్పటికీ పరిమితమైన లిక్విడిటీ స్వభావం ఉన్నందున రిటైర్మెంట్ అవసరాల కోసం ఒక్క ఎన్పీఎస్ మీదే ఆధారపడటం సరికాదన్నది నిపుణుల మాట. రిటైర్మెంట్ కోసం ఇతరత్రా సాధనాలకు కూడా పెట్టుబడులు కేటాయించడం మంచిదని వారి అభిప్రాయం. -
మైనర్లు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవచ్చా?
నేను నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఎన్‌పీఎస్‌లో అసెట్ అలకేషన్‌ను మార్చుకునే వీలు ఉందా ? ఉంటే ఏడాదిలో ఎన్ని సార్లు మార్చుకోవచ్చు? - విజయ్, కరీంనగర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో అసెట్ అలకేషన్‌ను ఏడాది కొకసారి మార్చుకోవచ్చు. టైర్ వన్, టైర్ టు ఖాతాలకు ఇది వర్తిస్తుంది. ఎన్పీఎస్ ఖాతా కింది మీరు యాక్టివ్అనే ఆప్షన్‌ను ఎంచుకుంటేనే ఇలా మార్చుకునే వీలు ఉంటుంది. ఇక ఏడాదిలో ఒకసారి యాక్టివ్ లేదా ఆటో చారుుస్ ఆప్షన్లను మార్చుకునే వీలు కూడా ఉంది. గమనించాల్సిన విషయమేమిటంటే ఏడాదిలో ఒక్కదానిని మాత్రమే అంటే, అసెట్ అలకేషన్‌ను మార్చుకోవడం గానీ లేదా యాక్టివ్, ఆటో చాయిస్ ఆప్షన్లను మార్చుకోవడం కానీ చేయవచ్చు. ఒక్క ఏడాదిలో ఈ రెండింటిని మార్చుకునే వీలు లేదు. ఎల్ఐసీ జీవన్లక్ష్య మంచి బీమా పాలసీయేనా ? దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యురిటీ తర్వాత మంచి రాబడులు వస్తాయని తెలిసిన ఎల్ఐసీ ఏజెంట్ అంటున్నాడు. దీంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా? - సందీప్, విశాఖ పట్టణం ఎల్ఐసీ జీవన్లక్ష్య అనేది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కలిసివున్న సంప్రదాయబద్ధమైన ఎండోమెంట్ బీమా పాలసీ. బీమా అవసరాల కోసం ఇలాంటి ఎండోమెంట్ పాలసీలు అవసరం లేదని మేం భావిస్తాం. ఇన్వెస్ట్‌మెంట్‌కు, బీమాకు వేర్వేరుగా ఇన్వెస్ట్ చేయాలి. ఈ రెండింటిని కలగలపకూడదు. బీమా కోసమైతే టర్మ్ ఇన్సూరెన్స పాలసీలు తీసుకోవడమే ఉత్తమం. వీటిల్లో ప్రీమియమ్‌లు తక్కువగానూ, బీమా కవర్ అధికంగానూ ఉంటాయి. మెచ్యూరైన తర్వాత భారీ మొత్తంలో సొమ్ము వస్తుందని చెప్పే పాలసీలు.. బీమా ముసుగులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లని చెప్పవచ్చు. ఈ తరహా పాలసీల్లో వ్యయాలు అధికంగానూ, బీమా కవర్ తక్కువగానూ ఉంటారుు. ఈ తరహా పాలసీలు దీర్ఘకాలం పాటు లాక్-ఇన్అయి ఉన్నప్పటికీ, చెప్పుకోదగ్గ స్థారుు రిటర్న్‌లు మాత్రం ఇవ్వలేవు. మీకు ఎంత బీమా అవసరమో లెక్కేసి, దానికి సరిపడా మంచి, ప్రీమియమ్‌లు తక్కువగా ఉండే టర్మ్ ఇన్సూరెన్సపాలసీ తీసుకోండి. జీవన్లక్ష్య వంటి పాలసీలకు చెల్లించే ప్రీమియమ్‌తో పోల్చితే ఈ టర్మ్ ఇన్సూరెన్సపాలసీలకు చెల్లించే ప్రీమియమ్ తక్కువగా ఉంటుంది. నా కొడుకు వయస్సు 12 సంవత్సరాలు. అతడి పేరు మీద మ్యూచువల్ఫండ్సలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అసలు మైనర్లు మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేయవచ్చా? - ఆనంద్, హైదరాబాద్ మైనర్లు(18 సంవత్సరాల వయస్సు లోపు వ్యక్తులు) మ్యూచువల్ఫండ్సలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ సంరక్షకుడి ద్వారా మాత్రమే జరగాలి. తండ్రి లేదా చట్టబద్ద సంరక్షకుడు, మైనర్ తరపున మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లావాదేవీలు నిర్వహించవచ్చు. మైనర్‌కు సంబంధించి వయస్సు ధ్రువీకరణ పత్రాలు, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు నిర్వహించడానికి సంరక్షకుడి సంబంధిత పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏడాది క్రితం ఒక క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ఫండ్స్లో రూ. 3 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు అనుకోకుండా నా కూతురిని విదేశాల్లో చదివించే అవకాశం వచ్చింది. ఈ ఫండ్ యూనిట్లను విక్రయించి నాకు కావలసిన సొమ్ము నేను తీసుకోవచ్చా? - సుధాకర్, తిరుపతి క్లోజ్డ్-ఎండ్ ఫండ్‌లో మెచ్యురిటీ కాలం ముగిసేదాకా మీరు మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రిడీమ్ చేసుకునే వీలు లేదు. అయితే క్లోజ్డ్-ఎండ్ మ్యూచువల్ఫండ్ యూనిట్లు సాధారణ షేర్ల మాదిరే స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌అయి ట్రేడ్ అవుతాయి. కాబట్టి మీ యూనిట్లను విక్రయించుకోవచ్చు. అయితే ఈ ఫండ్సలో ట్రేడింగ్ లావాదేవీలు చాలా స్వల్పంగా జరుగుతాయి. ఒక వేళ కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినా, ఎన్ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) కంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తామని అంటారు. అంటే వాటి విలువ కంటే తక్కువకే మీరు వాటిని విక్రయించాల్సి వస్తుంది. ఇప్పుడు విదేశాల్లో చదువుల కోసం పలు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మీ పాప విదేశీ విద్య కోసం బ్యాంకులను సంప్రదించండి. తప్పనిసరైతేనే. మీ మ్యూచువల్ ఫండ్యూనిట్లను విక్రయించండి. నేను మ్యూచువల్ ఫండ్సలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాలెన్సడ్ ఫండ్స మంచి రాబడులనిస్తాయని మిత్రులు చెబుతున్నారు. ఈ బ్యాలెన్సడ్ ఫండ్సలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేక పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయమంటారా? ఏ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి? - జాన్సన్, గుంటూరు దీర్ఘకాలం ఇన్వెస్ట్మెంట్ కోసం ఈక్విటీ లేదా బ్యాలెన్సడ్ మ్యూచువల్ ఫండ్స ఎంచుకోవడం మంచి విషయం. పిల్లల ఉన్నత చదువు, సొంత ఇల్లు కొనుక్కోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు వంటి తదితర దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఈ తరహా మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి తగిన రక్షణ పొందవచ్చు. ఒక వేళ మీ వద్ద పెద్ద మొత్తంలో సొమ్ములుంటే, ఆ మొత్తాన్ని ఏదైనా షార్ట్టర్మ్డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని సిస్టమాటిక్ ట్రాన్సఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా మీరు ఎంచుకున్న బ్యాలెన్సడ్ ఫండ్స్ లోకి బదిలీ చేయండి. -
దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఎన్పీఎస్ ఓకేనా?
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో పన్ను ప్రయోజనం పొందవచ్చా? నాకు ఇటీవలే కూతురు పుట్టింది. తన ఉన్నత విద్య నిమిత్తం ఇప్పటి నుంచే పొదుపు చేయాలనుకుంటున్నాను. అంటే 20 ఏళ్ల పాటు పొదుపు చేస్తాను. ఈ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలా? దేన్ని ఎంచుకుంటే నాకు పన్ను ప్రయోజనాలతో పాటు, అధిక రాబడులు వస్తాయి? - సాయి లీల, రాజమండ్రి నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేసి, 2016-17 ఆర్థిక సంవత్సరానికి సెక్షన్ 80సీసీడీ(వన్‌బి) కింద రూ.50,000 వరకూ అదనపు పన్ను మినహాయింపులు పొందవచ్చు. రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాలి, అదీ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన పథకంలో అంటే ఎన్పీఎస్ను ఎంచుకోవచ్చు. మీరు అరవై ఏళ్లు వచ్చేవరకూ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను హోల్డ్ చేయాల్సి ఉంటుంది. మీరు అరవై ఏళ్లు వచ్చి, రిటైరైన తర్వాత ఈ మొత్తం కార్పస్‌లో 40 శాతంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక అరవై ఏళ్లకు ముందే డబ్బులను విత్‌డ్రా చేయాలనుకుంటే, మీ కార్పస్‌లో కనీసం 80 శాతం మొత్తాన్ని యాన్యుటీని కొనుగోలుకు ఉపయోగించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్నుస్లాబ్ననుసరించి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం(కూతురి ఉన్నత విద్య) కోసమైతే, ఇన్వెస్ట్మెంట్స్ మీరే స్వయంగా చూసుకోగలిగితే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ను ఎంచుకోండి. ఈ స్కీమ్స్‌కు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మూడేళ్ల తర్వాత వీటిని ఖచ్చితంగా విక్రయించాల్సిన అవసరం లేదు. ఈఎల్ఎస్ఎస్లు తమ మొత్తం కార్పస్‌ను ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీకు మంచి రాబడులు వస్తాయి. అదే ఎన్‌పీఎస్‌లో అయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేది 50 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ఏడాది కాలం తర్వాత విక్రయించే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేనందున ఈఎల్ఎస్ఎస్పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకని దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఎన్పీఎస్ కంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ బెటర్. పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అధిక రాబడులూ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్ల కంటే డెరైక్ట్ ప్లాన్లకు ఉండే ప్రయోజనాలు, ప్రతికూలతలను వివరించండి ? - క్రిష్టోఫర్, నెల్లూరు డెరైక్ట్ ప్లాన్ల వల్ల మీకు కమీషన్లు, మార్కెటింగ్ సంబంధిత వ్యయాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇది ఎంత చిన్నమొత్తమైనా సరే దీర్ఘకాలం ఇన్వెస్ట్మెంట్ కారణంగా మీకు మంచి రాబడులు వస్తాయి. డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లభించే అతి పెద్ద ప్రయోజనం ఇది. ఇక డెరైక్ట్ ప్లాన్లకు సంబంధించి ఉన్న అతి పెద్ద ప్రతికూలాంశం ... మీ పెట్టుబడి నిర్ణయాలన్నింటిని మీరే స్వంతంగా తీసుకోవలసి రావడం. మీరు డెరైక్ట్ ప్లాన్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేస్తారు కాబట్టి. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సలహాలు మీకు అందుబాటులో ఉండవు. మీరే సొంతంగా రీసెర్చ్ చేసి. నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి. నా వయస్సు 65 సంవత్సరాలు. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవాలనుకుంటున్నాను. రెలిగేర్, స్టార్, టాటా ఏఐజీ, అపోలో మ్యూనిక్ వంటి కంపెనీలవి షార్ట్‌లిస్ట్ చేశాను. వీటిల్లో దేనిని ఎంచుకోవాలో సూచిస్తారా? - కిరణ్, వరంగల్ మీరు తీసుకునే హెల్త్ పాలసీ.. తగినంత కవరేజ్ ఇచ్చేదిగానూ, మీరు చెల్లించాల్సిన ప్రీమియమ్ మీ బడ్జెట్‌కు తగినట్లుగానూ ఉండాలి. బీమా తీసుకునే వ్యక్తికి ఇంతకు ముందే ఏవైనా రుగ్మతలు ఉంటే వాటికి సంబంధించిన కవరేజ్ క్లాజ్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇంతకు ముందే ఉన్న జబ్బులకు సంబంధించి కవరేజ్ పీరియడ్ ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉంటుంది. ఈ పీరియడ్ రెండు నుంచి నాలుగేళ్లుగా ఉంటుంది. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వండి. పాలసీ తీసుకున్న 30 రోజుల్లోపే మీరు చికిత్స తీసుకుంటే ఈ చికిత్సకయ్యే ఖర్చులు చాలా హెల్త్ పాలసీల్లో రీయింబర్స్ కావు. చాలా బీమా కంపెనీలు నగదు రహిత(క్యాష్‌లెస్), రీయింబర్స్మెంట్ ఫీచర్లున్న పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. నగదు రహిత సౌకర్యాన్నే ఎంచుకుంటే మంచిది. రీయింబర్స్మెంట్ ఫీచరున్న పాలసీలో అయితే మీ చికిత్సకయ్యే ఖర్చులు మీరు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులు సమకూర్చుకోవడం కొంచెం శ్రమతో కూడుకున్న పనే. మరోవైపు రీయింబర్స్మెంట్ కోసం చాలా డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నగదు రహిత సౌకర్యం తీసుకుంటే మీ నగరంలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్‌ను చెక్ చేసుకోవాలి. సదరు బీమా సంస్థ వెబ్సైట్లో మీరు తీసుకోవాలనుకుంటున్న ప్లాన్ బ్రోచర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. ఇక వివిధ సంస్థల పాలసీల వివరాలు చూద్దాం... స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే,.. ఈ పాలసీలో ఇంతకు ముందే ఉన్న జబ్బుల కవరేజ్ రెండో ఏట నుంచి లభిస్తుంది. 61-75 ఏళ్ల ఏజ్‌గ్రూప్ వారికి రూ.5 లక్షల బీమాకు ప్రీమియం రూ.20,610గా ఉంది. ఇక రెలిగేర్ సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇంతకు ముందే ఉన్న జబ్బులకు కవరేజ్ నాలుగో ఏడాది నుంచి లభిస్తుంది. రూ. 5 లక్షల హెల్త్ పాలసీకి ప్రీమియం 61-65 ఏళ్ల వయస్సుకు రూ.16,898-రూ.23,466 వరకూ ఉంటుంది. అపోలో మ్యూనిక్ ఆప్టిమా సీనియర్ పాలసీలోనూ ఇంతకు ముందే ఉన్న జబ్బుల కవరేజ్ 4వ ఏడాది నుంచి లభిస్తుంది. రూ. 5 లక్షల బీమాకు ప్రీమియమ్‌లు 61-65 ఏళ్లకు రూ.18,137గానూ, 66-70 ఏళ్ల వయస్సుకు రూ. 29,254గానూ, 71-75 ఏళ్ల వయస్సుకు రూ.38,136గానూ ఉన్నాయి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పెట్టు‘బడి’లో పాఠాలివీ..!
ఇప్పటి పరిస్థితుల్లో ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. కానీ ఇది చక్కటి ఆర్థిక ప్రణాళిక ఉంటేనే సాధ్యమవుతుంది. జీవిత కాలం కష్టపడి సంపాదించిన మొత్తాన్ని చక్కటి ఆర్థిక ప్రణాళికలతో పొదుపు చేస్తే భవిష్యత్తు అవసరాలకు తగినంత నిధిని సమకూర్చుకోవచ్చు. కానీ మనలో చాలామంది ఖర్చు చేసేటప్పుడు అది చిన్న మొత్తమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అంతెందుకు! కిలో టమాటాలు కొనేటపుడు కూడా గీచి గీచి బేరం చేస్తారు. * ఇన్వెస్ట్మెంట్లకు అనేక మార్గాలు * వయసు, రిస్కును బట్టే ఎంపిక * మీ లక్ష్యాన్ని తెలుసుకుంటే మేలు అదే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఉన్నత విద్యావంతులు సైతం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కష్టపడి చమటోడ్చి సంపాదించిన మొత్తాన్ని కూడా అన్ని విషయాలను పరిశీలించకుండా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడా విషయాలను పరిశీలిద్దాం... ఆర్థిక లక్ష్యాలు ప్రధానం.. ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు అనేక అంశాలు చూడాలి. వీటిలో ఆర్థిక లక్ష్యాలనేవి అన్నిటికంటే ప్రధానం. సొంత ఇంటిని కట్టుకోవాలనుకోవడం, కారు కొనుక్కోవడం, పిల్లల చదువు, పెళ్లిళ్లకు కావాల్సిన మొత్తం సమకూర్చుకోవడం, రిటైర్మెంట్, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి అవసరాలు తీర్చడం... ఇలా అనేక లక్ష్యాలుంటాయి. వీటిలో మీ లక్ష్యమేంటో నిర్ణయించుకొని... దాన్ని చేరుకోవడానికి ఎంత కాలం పడుతుందో నిర్ణయించుకొని మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ పథకాలను ఎంచుకోవాలి. చిన్న వయసులోనే ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే... షేర్లు, ఈక్విటీ ఫండ్స్ వంటి అధిక రిస్క్ ఉండే వాటిని ఎంచుకోవచ్చు. అదే వయసు పైబడుతున్న కొద్దీ.. రిస్క్ తక్కువగా ఉండే డెట్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్లు వంటివి అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు కుటుంబానికి తగినంత జీవిత, ఆరోగ్య బీమా ఉండే విధంగా చూసుకోవాలి. దాచుకోవడానికి అనేకం.. * ఇన్వెస్టర్లు దాచుకోవడానికి అనేక పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి.. * బ్యాంకు డిపాజిట్లు, ఎన్ఆర్ఐ డిపాజిట్లు, ఎఫ్సీఎన్ఆర్, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు, ప్రైవేటు కంపెనీల డిపాజిట్లు. * నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ * బంగారం వంటి ఖరీదైన లోహాలు * నేషనల్ పెన్షన్ సిస్టమ్ * పీపీఎఫ్, ఎన్ఎస్సీ, పోస్టాఫీస్ డిపాజిట్లు * స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు * రియల్ ఎస్టేట్ వీటిల్లో బ్యాంకులు, ఇతర డిపాజిట్లు, పీపీఎఫ్, ఎన్ఎస్లు చాలా తక్కువ రిస్క్ కలిగిన పెట్టుబడి సాధనాలుగా చెప్పవచ్చు. కానీ ఇదే సమయంలో ఇవి అందించే రాబడులు కూడా స్వల్పంగానే ఉంటాయి. అదే షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తాయి కానీ.. స్వల్ప కాలానికి చాలా రిస్క్‌తో కూడుకున్నవి. 200 ఏళ్ల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇతర పెట్టుబడి సాధనాలను మించి ఈక్విటీలు అధిక రాబడిని అందించాయి. 1980లో ఒక లక్ష రూపాయలు బ్యాంకులో, మరో లక్ష రూపాయలు సెన్సెక్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తం విలువ రూ.15 లక్షలు ఉంటే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన విలువ రూ. 25 (డివిడెండ్లు కాకుండా) లక్షలయ్యింది. అన్నిటికంటే ఈక్విటీ పెట్టుబడుల్లో ఉన్న ప్రధానమైన ఆకర్షణ ఏమిటంటే... పన్ను ప్రయోజనాలు. ఇవి అందించే రాబడులు, డివిడెండ్లపై ఎటువంటి పన్ను భారం ఉండదు. ఈక్విటీల్లో ఏడాది దాటి ఇన్వెస్ట్ చేసి ఉంటే దీర్ఘకాలిక మూల ధన పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది. ఇవన్నీ లభిస్తాయా?.. ఏదైనా పథకంలో ఇన్వెస్ట్ చేసేముందు మదుపుదారులు చాలా ఆశిస్తుంటారు. ఆ పెట్టుబడిపై క్రమం తప్పకుండా రాబడి రావాలని, ఇన్వెస్ట్ చేసిన ఆస్తుల విలువ పెరగాలని, అవసరానికి కావల్సినప్పుడు వైదొలిగే విధంగా లిక్విడిటీ ఉండాలని, పెట్టిన పెట్టుబడికి పూర్తి రక్షణ ఉండాలని, పన్ను రాయితీలు లభించాలని... ఇలా అనేకం ఆశిస్తుంటారు. కానీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ సాధనమూ వీటన్నిటినీ అందించలేదు. బ్యాంకు డిపాజిట్లు క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తాయి. కానీ ఇన్వెస్ట్ చేసిన అసలు వృద్ధి చెందదు. దీర్ఘకాలంలో బంగారం రాబడిని అందించ గలదు. కానీ లిక్విడిటీ, పన్ను ప్రయోజనాలు లభించవు. ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కావల్సినప్పుడు వెంటనే వెనక్కి తీసుకునే వెసులుబాటుండదు. కాని చక్కటి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అయితే స్వల్ప కాలానికి ఈక్విటీ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకున్నవి. రిస్క్ ఆధారంగానే నిర్ణయం.. వయసుతో బాటు బాధ్యతలు పెరగడంతో రిస్క్ సామర్థ్యం (నష్టాన్ని భరించే) తగ్గుతుంది. కాబట్టి ఏ మేరకు రిస్క్ చేయగలరనేది మీ వయసుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 35 ఏళ్లలోపు ఉన్న వారు ఎక్కువ రిస్క్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోను తయారు చేసుకోవచ్చు. అదే 35 నుంచి 50 ఏళ్ల లోపు వారు సమతూకం పాటిస్తూ బ్యాలెన్స్డ్గా వెళ్లాలి. 50 ఏళ్లు దాటితే ఇక రిటైర్మెంట్కు దగ్గర అవుతారు కాబట్టి ఇక రిస్క్‌లేకుండా పోర్ట్‌ఫోలియోను తయారు చేసుకోవాలి. పోర్ట్‌ఫోలియో ఏ విధంగా ఉండాలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. - డాక్టర్. వి.కె.విజయ్‌కుమార్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ బీఎన్పీ పారిబాస్ -
ఆకర్షణీయంగా.. ఎన్పీఎస్
జాతీయ పింఛను విధానం. ఇంగ్లిష్‌లో ముద్దుగా ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్). 2004లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని 2009 నుంచీ అందరికీ వర్తింపజేసినా... అది అత్యంత ఆకర్షణీయంగా మారింది మాత్రం ఇప్పుడే. ఎందుకంటే ఇప్పటిదాకా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీలో ఉన్న ఈ పథకాన్ని... ఇకపై 80సీసీడీ (1బీ) కిందికి తెచ్చారు. అంటే ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పటిదాకా 80సీ పరిధిలో ఉండగా... ఇక నుంచి కొత్త సెక్షన్ పరిధిలోకి వస్తాయన్న మాట. అంటే 80సీ కింద ఉన్న మినహాయింపులకు అదనంగా ఈ మినహాయింపులు లభిస్తాయన్న మాట. ఇదే అత్యంత ఆకర్షణీయ అంశం కూడా. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఇక రూ. 50 వేల వరకూ పన్ను మినహాయింపు ⇒ 80సీ నుంచి తొలగించి 80సీసీడీ(1బీ) కిందికి ⇒ ప్రత్యేక సెక్షన్ కిందికి తేవటంతో గరిష్టంగా రూ. 15,000 పన్ను ఆదా ⇒ 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి సెక్షన్ 80సీ కింద స్కూల్ ఫీజులు, బీమా పథకాలు, పీఎఫ్ వంటి పథకాల్లో పెట్టే పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకూ ఐటీ మినహాయింపు ఉంది. ఇప్పటిదాకా ఎన్పీఎస్ కూడా దీని పరిధిలోనే ఉంది. ఇపుడు దీన్ని ప్రత్యేక సెక్షన్ కిందికి తేవటం ద్వారా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటే ఇచ్చారు. దీంతో 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచీ ఎన్‌పీఎస్‌లో చేసే పెట్టుబడులపై గరిష్టంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. దేశంలో అత్యధికంగా ఉన్న యువత భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జాతీయ పెన్షన్ విధానంపై (ఎన్పీఎస్) ప్రత్యేక రాయితీలను ఇస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. రూ.50 వేల వరకూ మినహాయింపు ఇవ్వటం ద్వారా 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి గరిష్టంగా రూ.15,000, 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి రూ.10,000, అదే 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి రూ.5,000 ఆదా అవుతుంది. అయితే ఈ సెక్షన్ పరిధిలోకి అన్ని పెన్షన్ పథకాలను తేకుండా కేవలం ఎన్పీఎస్నే తేవటాన్ని ఈ సందర్భంగా గమనించాలి. బీమా పెన్షన్ పథకాలనూ దీని పరిధిలోకి తెచ్చేలా ఒత్తిడి తెస్తామని బీమా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) దేశంలో ప్రతి వ్యక్తీ పెన్షన్ పొందేలా 2009లో కేంద్రం నేషనల్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెలకు కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీనిని ప్రారంభించుకోవచ్చు. కనీసం సంవత్సరానికి రూ.6,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పింఛను నిధుల నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) పరిధిలో పనిచేసే ఈ పథకంలో 18 ఏళ్ళ వారి నుంచి 55 ఏళ్ళ వారు ఖాతాను ప్రారంభించవచ్చు. సమీపంలోని పోస్టాఫీసు, బ్యాంకులు లేదా బ్రోకింగ్ సంస్థల దగ్గర ఎన్పీఎస్ ఖాతాను ప్రారంభించొచ్చు. మూడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు.. ఎన్పీఎస్ మూడు రకాలైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తోంది. మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఈ, సీ, జీ పేరుతో మూడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయంటే... ఈ (ఈక్విటీ) ⇒ ఇందులో పెట్టే పెట్టుబడులను గరిష్టంగా 50 శాతం వరకూ ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సీ (క్రెడిట్ రిస్క్ బేరింగ్ ఇన్స్ట్రమెంట్స్) ⇒ ఈ ఆప్షన్ తీసుకుని పెట్టే పెట్టుబడులను స్వల్ప రిస్క్ ఉండే లిక్విడ్ ఫండ్స్, కార్పొరేట్ డెట్, ఇతర స్థిరాదాయం ఇచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. జీ (గవర్నమెంట్ సెక్యూరిటీస్) ⇒ ఈ ఆప్షన్‌ను తీసుకుని పెట్టే పెట్టుబడులను ఎటువంటి రిస్క్ లేని కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎన్ఏ (ఏ ఆప్షన్‌నూ ఎంచుకోకుంటే) ⇒ ఏ ఆప్షన్‌నూ తీసుకోకుండా పెట్టే పెట్టుబడులను ఆటో చాయిస్ కింద భావించి మీ వయస్సు ఆధారంగా ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్‌ను మార్చుకుంటూ పోతారు. ఉదాహరణకు 35 సంవత్సరాల్లో జీ ఆప్షన్లో 20 శాతం ఇన్వెస్ట్ చేస్తే అతని వయస్సు 55 సంవత్సరాలు వచ్చేసరికి జీ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ 80 శాతానికి చేరుకుంటుంది. అందుబాటులో ఏడు ఫండ్లు ఈ పెన్షన్ ఫండ్స్‌ను నిర్వహించడానికి పీఎఫ్ఆర్డీఏ ఎనిమిది సంస్థలకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఏడు పెన్షన్ ఫండ్స్‌లో మీకు నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు. త్వరలోనే బిర్లాసన్లైఫ్ ఈ రంగంలోకి అడుగు పెట్టనుంది. మీరు ఎంచుకున్న ఫండ్ హౌస్ పనితీరు నచ్చకపోతే వీటిని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. రెండు ఖాతాలు.. ఎన్పీఎస్ టైర్-1, టైర్-2 పేరుతో రెండు ఖాతాలను అందిస్తోంది. ఇందులో టైర్-1 ఖాతాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ను 60 ఏళ్ళు వచ్చే వరకు వెనక్కి తీసుకునే అవకాశం లేదు. దీనికి అదనంగా టైర్-2 ఖాతాను ప్రారంభించి అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. టైర్-2 ఖాతా నుంచి ఎప్పుడైనా వైదొలగొచ్చు. కానీ టైర్-1 ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై మాత్రమే సెక్షన్ 80సీసీడీ(1బీ) పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఇక విత్‌డ్రాయల్ విషయానికి వచ్చేసరికి 60 సంవత్సరాల లోపు వైదొలిగితే పెన్షన్ నిధిలో 80 శాతాన్ని తప్పకుండా యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉం టుంది. అదే 60 ఏళ్ల తర్వాత వైదొలిగితే కనీసం 40% యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ యాన్యుటీ పథకాలే ప్రతి నెలా పెన్షన్‌ను అందిస్తాయి. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం