
'కేసీఆర్ బక్క మనిషైనా.. బలమైన నిర్ణయాలు తీసుకున్నారు'
హైదరాబాద్: అందరి సహకారంతో తెలంగాణలో గోదావరి పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పుష్కరాలు విజయవంతం చేసిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బక్కపలుచని మనిషైనా కొన్నింటిలో బలమైన నిర్ణయాలు తీసుకున్నారని వారు అన్నారు. గతంలో పుష్కరాలు అంటే రాజమండ్రి అన్న భ్రమను తొలగించారన్నారు. ఇప్పుడా పరిస్థితిని మార్చి తెలంగాణలో పుష్కరాలను విజయవంతం చేశారన్నారు. ఇదే అనుభవంతో రానున్న సమ్మక్క సారక్క, కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతం చేస్తామని వారు తెలిపారు.