ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మైనారటీ ముస్లిం చిన్నారులకు మొరుగైన విద్యను అందించాలని అఖిలేష్ ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం ఓ పథకాన్ని రూపొందించింది. ఆ పథకం అమలుకు రాష్ట్రంలోని 40 జిల్లాలను ఎంపిక చేశారు. అయా జిల్లాలో ముస్లిం జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకుని పాఠశాలు నిర్మించనున్నారు. అందుకు సంబంధించిన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జావేద్ ఉస్మాని నుంచి తమకు ఆదేశాలు అందాయని ఉన్నతాధికారి ఒకరు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. అందుకు సంబంధించిన బ్లూప్రింట్ను సిద్ధం చేయాలిని తమకు జారీ చేసిన ఆదేశాలో పేర్కొన్నారని ఆయన వివరించారు.
ముస్లిం చిన్నారుల కోసం అన్ని సౌకర్యాలతో మరింత అత్యాధునిక పాఠశాలను నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. అయితే రెండు దశలుగా ఆ పాఠశాలలు నిర్మిస్తామన్నారు. మొదటి దశలో 20 పాఠశాలు, మరో దశలలో 20 పాఠశాలలు నిర్మిస్తామని ఆయన వివరించారు. ఆ పథకం అమలు ప్రక్రియను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మైనారటి సంక్షేమ శాఖ మంత్రి అజాంఖాన్ పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 210 మిలియన్ల జనాభా ఉన్నారు. వారిలో ముస్లింలు 20 శాతం మేర ఉన్న సంగతి తెలిసిందే.