
'ఓటమిని ఒప్పుకున్న మోదీ'
మహా కూటమిని 'త్రీఇడియట్స్' వర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిప్పికొట్టారు.
బెనిపట్టి/కిషన్ గంజ్: మహా కూటమిని 'త్రీఇడియట్స్' వర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. ఈ వాఖ్యలు చేయడం ద్వారా బిహార్ ఎన్నికల్లో ఓటమిని మోదీ ముందే అంగీకరించారని రాహుల్ అన్నారు.
'బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తప్పదని మోదీకి తెలిసిపోయింది. అందుకే మహా కూటమిని సైతాన్, త్రీఇడియట్స్ అంటూ సంబోధిస్తున్నారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నానన్న విషయాన్ని మోదీ మర్చిపోతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన హోదాకు తగవు' అని రాహుల్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీల్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. సూటు, బూటు సర్కార్ అంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బూటకపు హామీలతో ప్రజలను మోదీ బురిడీ కొట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా అబద్దాలు కట్టిపెట్టి నితీశ్ కుమార్ లా దేశ ప్రజల కోసం పనిచేయాలని మోదీని హితవు పలికారు.