ఫండ్స్‌పై 30 శాతం తగ్గిన ఇన్వెస్టర్ల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌పై (ఎంఎఫ్) ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అసోషియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. గతేడాది (2014-15) టాప్-10 మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)పై ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 21,000గా ఉంది. ఇది 2013-14 లోని 30,065 ఫిర్యాదులతో పోలిస్తే 30 శాతం తక్కువ.