రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన సభ్యులు ముఖ్యమంత్రిని ఎన్నుకునే సంప్రదాయం గతం నుంచి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అంతేకాని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పేరు ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్కు లేదన్నారు. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థి పేరు ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ చరిత్రలోనే లేదని ఆయన గుర్తు చేశారు. వారసియెనిలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
మధ్యప్రదేశ్లో శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తే కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా సీఎం పాలన పగ్గాలు చేపడతారని ఊహాగానాలు ఉపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి సింధియానేనా అని విలేకర్ల అడిగిన ఓ ప్రశ్నకు సింగ్ పైవిధంగా సమాధానం చెప్పారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. అయితే వాటి పేర్లు మార్చి తామే ఆ పథకాలను ప్రారంభించినట్లు ఈ ప్రభుత్వం గప్పాలు చెప్పుకుంటుందని ఆయన శివరాజ్ సింగ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.